logo

ఖాతాలోకి రూ.3 కోట్లు.. వెంటనే ఖాళీ

‘ఆ రూ.3 కోట్లు ఎవరివో తెలియదు.. తమ బ్యాంక్‌ ఖాతాలో జమై, కొద్ది క్షణాల్లోనే మళ్లీ మాయమయ్యాయి’ అని ఓ సంస్థ యాజమాన్యం మంగళవారం హైదరాబాద్‌ సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే..

Published : 19 Jan 2022 03:59 IST

సైబర్‌ పోలీసులను ఆశ్రయించిన ఓ సంస్థ యాజమాన్యం

నారాయణగూడ, న్యూస్‌టుడే: ‘ఆ రూ.3 కోట్లు ఎవరివో తెలియదు.. తమ బ్యాంక్‌ ఖాతాలో జమై, కొద్ది క్షణాల్లోనే మళ్లీ మాయమయ్యాయి’ అని ఓ సంస్థ యాజమాన్యం మంగళవారం హైదరాబాద్‌ సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. యాకుత్‌పురకు చెందిన సమ్రీన్‌ అనే వ్యక్తి ‘మాస్ట్రో ఫైనాన్షియల్‌ కంప్యూటర్‌ అడ్వయిజర్స్‌’ పేరిట సంస్థ నిర్వహిస్తున్నారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి వారి కార్యాలయానికి వచ్చి.. తన పేరు సుల్తాన్‌ ఆసీఫుద్ధీన్‌, పాతబస్తీ ఉస్మాన్‌పురలో ఉంటా.. ప్రస్తుతం ఓ జాతీయ బ్యాంక్‌లో ఉద్యోగిని. లోన్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తానని పరిచయం చేసుకున్నాడు. వ్యాపార వృద్ధికి అవసరమైన లోన్‌ తమ బ్యాంక్‌ నుంచి ఇప్పిస్తానని చెప్పాడు. సమ్రీన్‌ సరే అనడంతో కరెంట్‌ బ్యాంక్‌ ఖాతా, సీవీవీ, పాస్‌వర్డ్‌, పిన్‌ నంబర్లు అంటూ చకచకా కీలకమైన వివరాలన్నీ తీసుకున్నాడు. నాలుగైదు రోజులుగా సమ్రీన్‌ సంస్థ ఖాతాలో రూ.వంద, రూ.వెయ్యి చొప్పున మొత్తం రూ.3 కోట్ల వరకు జమయ్యాయి. కొద్ది క్షణాల్లోనే ఆ మొత్తం మళ్లీ మాయమైంది. ఏదో మోసం జరుగుతోందని గ్రహించిన సమ్రీన్‌ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని