logo

జాతీయస్థాయి కళా ఉత్సవ్‌ పోటీల్లో..మేడ్చల్‌ విద్యార్థినికి ప్రథమ స్థానం

జాతీయ స్థాయి కళా ఉత్సవ్‌ -2021 పోటీల్లో శాస్త్రీయ నృత్యం విభాగంలో మేడ్చల్‌ జిల్లా విద్యార్థిని శిశిర ప్రతిభ చాటింది. జాతీయ స్థాయిలో బాలికల విభాగంలో మొదటి బహుమతి దక్కించుకుంది. సమగ్ర శిక్ష

Published : 19 Jan 2022 04:18 IST


కె.శిశిర

ఈనాడు, హైదరాబాద్‌ : జాతీయ స్థాయి కళా ఉత్సవ్‌ -2021 పోటీల్లో శాస్త్రీయ నృత్యం విభాగంలో మేడ్చల్‌ జిల్లా విద్యార్థిని శిశిర ప్రతిభ చాటింది. జాతీయ స్థాయిలో బాలికల విభాగంలో మొదటి బహుమతి దక్కించుకుంది. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈనెల ఒకటో తేదీ నుంచి 12 వరకు వర్చువల్‌ విధానంలో జాతీయ పోటీలు జరిగాయి. మంగళవారం కేంద్ర విద్యాశాఖ విజేతలను వివరాలను ప్రకటించింది. 9 అంశాలలో తెలంగాణ నుంచి 18 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. శాస్త్రీయ నృత్యం కేటగిరీలో మేడ్చల్‌ జిల్లాకు చెందిన విద్యార్థిని కోకిలవాణి శిశిర దేశంలోనే ప్రథమస్థానం దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె రామంతాపూర్‌లోని హెచ్‌పీఎస్‌ 9వ తరగతి చదువుతోంది. ఆమెను మేడ్చల్‌ కలెక్టర్‌ ఎస్‌.హరీష్‌, డీఈవో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని