logo

ఖాళీ అవుతున్న ఠాణాలు

కొవిడ్‌ ప్రభావంతో పోలీస్‌స్టేషన్లు ఖాళీ అవుతున్నాయి. ఫిర్యాదుల స్వీకరణకు పోలీసులు ఆరుబయట టెంట్‌లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మూడోదశ తీవ్రతతో అనారోగ్యం, పదవీ విరమణకు దగ్గరగా

Published : 19 Jan 2022 04:18 IST

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, పంజాగుట్ట: కొవిడ్‌ ప్రభావంతో పోలీస్‌స్టేషన్లు ఖాళీ అవుతున్నాయి. ఫిర్యాదుల స్వీకరణకు పోలీసులు ఆరుబయట టెంట్‌లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మూడోదశ తీవ్రతతో అనారోగ్యం, పదవీ విరమణకు దగ్గరగా ఉన్న సిబ్బంది విధులకు వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నట్టు సమాచారం. మరికొందరు సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 650 మంది సిబ్బంది కొవిడ్‌ కాటుకు గురయ్యారు. ముగ్గురు డీసీపీలు, 5-6 ఐపీఎస్‌ అధికారులు, బేగంపేట-10, మాదాపూర్‌ 10, గచ్చిబౌలి 04, ఇబ్రహీంపట్నం 04, నార్సింగి-12, జీడిమెట్ల-06, కేపీహెచ్‌బీ 08, జగద్గిరిగుట్ట 10, హయత్‌నగర్‌ 14, పంజాగుట్టలో 8 మంది కరోనాకు గురయ్యారు.  మూడు పోలీసు కమిషనరేట్ల సీపీలు సీవీ ఆనంద్‌, మహేశ్‌ భగవత్‌, స్టీఫెన్‌ రవీంద్ర సిబ్బందితో వీడియోకాల్‌ ద్వారా మాట్లాడుతూ.. మనోధైర్యం నింపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని