logo

వనరులు సమృద్ధి.. దృష్టి సారిస్తే ఆర్థిక వృద్ధి

జిల్లా కేంద్రంలో ఆర్టీసీకి వనరులు పుష్కలం. వీటిని వినియోగించుకుంటే ఆదాయం పెరగనుంది. వికారాబాద్‌ జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటి నుంచి పట్టణం దినదినాభివృద్ధి చెందుతోంది. గృహ నిర్మాణాలు విపరీతంగా పెరిగాయి. వ్యాపార రంగంలో మార్పులు వస్తున్నాయి.

Published : 20 Jan 2022 01:46 IST

రైల్వే స్టేషన్‌ వైపు ఉన్న స్థలం

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలో ఆర్టీసీకి వనరులు పుష్కలం. వీటిని వినియోగించుకుంటే ఆదాయం పెరగనుంది. వికారాబాద్‌ జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటి నుంచి పట్టణం దినదినాభివృద్ధి చెందుతోంది. గృహ నిర్మాణాలు విపరీతంగా పెరిగాయి. వ్యాపార రంగంలో మార్పులు వస్తున్నాయి. వాణిజ్య సముదాయాలు వెలుస్తున్నాయి. మాల్స్‌, సెల్‌ఫోన్‌ దుకాణాలు, ఆసుపత్రులు వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, వాహన, వస్త్ర విక్రయ దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. వికారాబాద్‌ పరిసర మండలాల్లోని ప్రజలు, గ్రామాల వారు వికారాబాద్‌లో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 43 వేలు మాత్రమే. నేడు 80 వేల వరకు పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిపోయే వారు పెరిగారు. ఈ క్రమంలో పట్టణంలో దుకాణ సముదాయాలకు డిమాండ్‌ పెరిగింది. పట్టణంలో ప్రధాన ప్రాంతాల్లో అద్దెలకు దుకాణాలు లభించడంలేదు. ఆలంపల్లి రోడ్డు, ఎన్టీఆర్‌ చౌరస్తాలో, స్టేషన్‌ రోడ్డు ప్రాంతాల్లో అద్దెలకు దుకాణాలు అందుబాటులోనే లేవు. ఈ మార్గంలో అద్దెకు చిన్నపాటి షెట్టర్‌ కావాలన్నా రూ.3 లక్షల నుంచి 5 లక్షల అడ్వాన్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇటువంటి సమయంలో ఆర్టీసీ తన వననరులను వినియోగిస్తే పుష్కలమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

ఇలా చేస్తే.. ఆర్టీసీ బస్‌స్టాండ్‌ పట్టణంలో ప్రధాన ప్రాంతంలో ఉంది. రైల్వేస్టేషన్‌, పురపాలక సంఘ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాల, పెట్రోల్‌ బంక్‌, పురపాలక సంఘం షాషింగ్‌ కార్యాలయం దగ్గరగా ఉంటాయి. 4 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. గంగారం రోడ్డు వైపు 40 దుకాణాలు, రైల్వే స్టేషన్‌ రోడ్డు వైపు 20 దుకాణాలు నిర్మించవచ్ఛు వీటిని అద్దెకు ఇస్తే నెలకు లక్షలాది రూపాయలు ఆర్టీసీకి సమకూరుతుంది. నష్టాల్లో ఉన్న సంస్థ అదనపు ఆదాయ వనరులపై దృష్టి సారించాలని పలువురు సూచిస్తున్నారు. దుకాణ సముదాయాన్ని నిర్మిస్తే వచ్చే ఆదాయంతో బస్‌స్టాండ్‌ను అభివృద్ధి చేయవచ్ఛు నిర్మాణాలు కూడా అడ్వాన్స్‌ల ద్వారా చేపట్టవచ్ఛు

ప్రతిపాదనలున్నాయి: దైవాదీనం, ఆర్టీసీ డిపో మేనేజర్‌, వికారాబాద్‌

బస్‌స్టాండ్‌కు చెందిన ఖాళీ స్థలంలో ఒక పక్కన షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలని ప్రతిపాదించి ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించాం. మరో వైపు పెట్రోల్‌ బంక్‌కు కేటాయించాలని నిర్ణయించాం. పెట్రోల్‌ బంక్‌ కోసం కేటాయించిన స్థలాన్ని తీసుకునే వారు వచ్చి చూసి, అంగీకరించారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి టెండర్లు పిలుస్తారన్న సమాచారం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని