logo

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే రౌడీషీట్‌: ఎస్పీ

జిల్లాలో ఉన్న రౌడీషీటర్లు, పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి తీరు మార్చుకునేలా చూడాలని జిల్లా పోలీసు అధికారి ఎన్‌.కోటిరెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక జిల్లా కార్యాలయంలో అధిక తీవ్రత ఉన్న నేరాలపై డీఎస్పీలు,

Published : 20 Jan 2022 01:46 IST

వికారాబాద్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఉన్న రౌడీషీటర్లు, పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి తీరు మార్చుకునేలా చూడాలని జిల్లా పోలీసు అధికారి ఎన్‌.కోటిరెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక జిల్లా కార్యాలయంలో అధిక తీవ్రత ఉన్న నేరాలపై డీఎస్పీలు, సీఐలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నేరప్రవృత్తి కలిగిన వారిని ఏమాత్రం ఉపేక్షించవద్దని, తరచూ నేరాలతో శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేసి కారాగారంలో మగ్గేలా చేయాలని ఆదేశించారు. బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులకు పాల్పడితే నేర చరిత్ర ఆధారంగా రౌడీషీట్లు తెరువాలన్నారు. పోలీస్‌ఠాణాల వారీగా నేర తీవ్రత అధికంగా ఉన్న కేసులను పరిశీలించి, అపరిష్కృతంగా ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. మట్కా, పేకాట, అక్రమ ఇసుక రవాణా, గంజాయి వంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. మహిళలపై వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, నిందితులకు న్యాయస్థానంలో శిక్ష పడేలా సమర్థవంతంగా పరిశోధించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా పోలీసు అధికారి రషీద్‌, వికారాబాద్‌, తాండూరు, పరిగి డీఎస్పీలు సత్యనారాయణ, లక్ష్మినారాయణ, శ్రీనివాస్‌, ఏఆర్‌ డీఎస్పీ సత్యనారాయణ, వికారాబాద్‌, పరిగి, మోమిన్‌పేట, తాండూరు పట్టణ, గ్రామీణ, కొడంగల్‌, ధారూర్‌ సీఐలు రాజశేఖర్‌, వెంకట్రామయ్య, వెంకటేశం, రాజేందర్‌రెడ్డి, జలంధర్‌రెడ్డి, అప్పయ్య, తిరుపతిరాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని