logo

బంగ్లాదేశ్‌లో సిద్దిపేట జిల్లా వాసి ఆత్మహత్య

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం దానంపల్లికి చెందిన లింగాల నర్సింలు(38) బంగ్లాదేశ్‌లో నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే గ్రామవాసులు నలుగురు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసర ప్రాంతంలోని ఓ ఎక్స్‌ప్లోజివ్స్‌ కంపెనీ లారీలకు చోదకులుగా కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు.

Published : 20 Jan 2022 01:46 IST

ఆలస్యంగా వెలుగులోకి.. మృతదేహం కోసం ఎదురుచూపులు

చేర్యాల, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం దానంపల్లికి చెందిన లింగాల నర్సింలు(38) బంగ్లాదేశ్‌లో నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే గ్రామవాసులు నలుగురు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసర ప్రాంతంలోని ఓ ఎక్స్‌ప్లోజివ్స్‌ కంపెనీ లారీలకు చోదకులుగా కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. లారీల్లో కంపెనీ సామగ్రిని తరచూ బంగ్లాదేశ్‌కు రవాణా చేస్తుంటారు. పదిహేను రోజుల క్రితం నర్సింలు వాటిలోని ఒక లారీకి క్లీనర్‌గా పనికి కుదిరాడు. ఆయనకు గతంలో మానసిక స్థితి సరిగా లేనందున కుటుంబ సభ్యులు పలు చికిత్సలు చేయించగా కొంతమేర నయమైంది. వారి కుటుంబానికి ఇల్లు తప్ప ఇతర ఆస్తులు లేవు. కూలీ పనులు చేసుకునే వారికి రూ.లక్షకు పైగా అప్పులున్నాయి. వాటిని తీర్చడానికి క్లీనర్‌ పనికి అంగీకరించాడు. ఈనెల 16న లారీపై నర్సింలు బంగ్లాదేశ్‌కు చేరుకున్నాడు. ఆ దేశం మార్గమధ్యలో చోదకులు అల్పాహారం చేయడానికి రమ్మంటే రానని లారీలోనే ఉన్నాడు. వారు చేసొచ్చేసరికి లారీ క్యాబిన్‌లోనే ప్యాకింగ్‌ చేసే తీగతో ఉరేసుకొని కనిపించాడు. డ్రైవర్లు ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. నాలుగు రోజులు దాటినా కొడుకు మృతదేహం గ్రామానికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు పట్టించుకొని మృతదేహం త్వరగా వచ్చేలా చేయాలని తండ్రి రాజమల్లయ్య కోరుతున్నారు. నర్సింలుకు తల్లిదండ్రులు సహా భార్య, ఇద్దరు కుమారులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని