logo

నిమ్స్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సేవలెప్పుడో!

ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిమ్స్‌లో ఇంకా ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధాన మంత్రి జన్‌ ఆరోగ్య యోజన సేవలు అందుబాటులోకి రాకపోవడంతో పేద రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. గతేడాది ఆగస్టు నాటికే ఈ సేవలు ప్రారంభించాల్సి ఉంది.

Published : 20 Jan 2022 03:11 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిమ్స్‌లో ఇంకా ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధాన మంత్రి జన్‌ ఆరోగ్య యోజన సేవలు అందుబాటులోకి రాకపోవడంతో పేద రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. గతేడాది ఆగస్టు నాటికే ఈ సేవలు ప్రారంభించాల్సి ఉంది. ప్రస్తుతమున్న ఆరోగ్యశ్రీ సేవలకు ఇవి అదనం. ఆయుష్మాన్‌ భారత్‌లో కొవిడ్‌ సహా ఇతర రకాల చికిత్సలను చేర్చారు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.5 లక్షల ఖర్చయ్యే వైద్యం లభిస్తుంది. నిమ్స్‌లో కార్పొరేట్‌ స్థాయిలో కార్డియాలజీ, నెఫ్రాలజీ, గాస్ట్రోఎంటరాలజీ, ఆంకాలజీ, సర్జికల్‌ గాస్ట్రో, న్యూరాలజీ తదితర సేవలు అందుతుంటాయి. ఆరోగ్యశ్రీ పథకంతో చాలామంది పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం దక్కుతోంది. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా నిరుపేదలు ఒక్క పైసా ఖర్చు లేకుండా అన్ని రకాల వైద్య సేవలను పొందే అవకాశాన్ని కల్పించారు. అనాథలు, భిక్షగాళ్లు, వికలాంగులు, వృద్ధులు, కూలీలు, ఇల్లు లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు, ఒకే గదిలో ఉండే కుటుంబాలు, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న వారు, కాపలాదారులు, డ్రైవర్లు.. ఇలా అనేక మంది ఈ పథకానికి అర్హులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని