logo

పంజాగుట్టలో స్టీల్‌ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి తలసాని

దేశంలోని మెట్రో నగరాలను దాటి హైదరాబాద్‌ ముందుకెళుతోందని మంత్రి

Published : 20 Jan 2022 12:38 IST

హైదరాబాద్‌: దేశంలోని మెట్రో నగరాలను దాటి హైదరాబాద్‌ ముందుకెళుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. నగరంలోని పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద ఏర్పాటు చేసిన స్టీల్‌ బ్రిడ్జిని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ రోజు నుంచి వంతెను ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు. పంజాగుట్ట స్మశాన వాటిక వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యేవన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా రూ.17 కోట్లతో స్టీల్ వంతెన నిర్మించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఇతర తెరాస నేతలు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని