logo

రోడ్డు విస్తరణ పనులు షురూ...

తాండూరు పట్టణం ఇందిరా గాంధీ కూడలి నుంచి రైల్వేస్టేషన్‌ దాకా రోడ్డు పనులు మొదలయ్యాయి. పురపాలక సంఘం, రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.

Published : 21 Jan 2022 01:05 IST

తాండూరు టౌన్‌ (న్యూస్‌టుడే): తాండూరు పట్టణం ఇందిరా గాంధీ కూడలి నుంచి రైల్వేస్టేషన్‌ దాకా రోడ్డు పనులు మొదలయ్యాయి. పురపాలక సంఘం, రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. మొత్తం 800 మీటర్ల పొడవు విస్తరిస్తున్నారు. రెండు వైపులా 80 మీటర్ల రోడ్డును వెడల్పు చేస్తున్నారు. ప్రస్తుతం రెండు వైపులా కేవలం 25 నుంచి 30 మీటర్లు మాత్రమే రోడ్డు ఉంది. ఇరువైపులా వివిధ రకాల వ్యాపార దుకాణాలు ఉన్నాయి. వాటి ముందు వాహనాలు నిలపటం, రోడ్డు మీదనే చిరు వ్యాపారాలు జరగటంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్డు పొడవునా మొత్తం 94 ఆక్రమణలు గుర్తించారు. వాటిలో భవనాలతో పాటు ప్రహరీ గోడలు ఇతర తాత్కాలిక నిర్మాణాలు ఉన్నాయి. వీటితో పాటు ప్రభుత్వ ఆస్తులూ ఉన్నాయి. వాటిలో ఇది వరకే జిల్లా ఆస్పత్రి, పురపాలక సంఘం పాత కార్యాలయం, పోట్లీ మహారాజ్‌ దేవాలయం వద్ద నిర్మాణాలను తొలగించారు. ఇంకా మిగిలిన వాటినీ త్వరలోనే కూల్చివేయటానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబందించిన తపాల శాఖ కార్యాలయం ప్రహరీ తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని