logo

యూకేలో ఉద్యోగం పేరిట రూ.11.14 లక్షలు స్వాహా

యూకేలో ఉద్యోగం పేరిట రూ.11.14 లక్షలు దోచేశారు సైబర్‌ కేటుగాళ్లు. హైదరాబాద్‌ సైబర్‌ ఠాణా ఎస్సై వినయ్‌ వివరాల ప్రకారం.. డబీర్‌పురకు చెందిన సయ్యద్‌ వసీమ్‌

Published : 21 Jan 2022 01:27 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: యూకేలో ఉద్యోగం పేరిట రూ.11.14 లక్షలు దోచేశారు సైబర్‌ కేటుగాళ్లు. హైదరాబాద్‌ సైబర్‌ ఠాణా ఎస్సై వినయ్‌ వివరాల ప్రకారం.. డబీర్‌పురకు చెందిన సయ్యద్‌ వసీమ్‌ విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పరిచయమై యూకేలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. అది నమ్మి వసీమ్‌ ప్రాసెసింగ్‌ ఫీజు, వీసా ఖర్చుల కోసం రూ.9 లక్షల వరకు చెల్లించారు. ఆర్‌బీఐలో డిపాజిట్‌ చేయడానికి మరో రూ. 2.14 లక్షలు కావాలని కోరాడు. ఇలా మొత్తం రూ.11.14 వరకు ఆ మోసగాడికి సమర్పించేశారు. ఆ తర్వాత తాను మోసపోయినట్లు తెలుసుకొని హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని