logo

వృద్ధుడికి ఐదేళ్ల కారాగారం

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడికి న్యాయస్థానం ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బాధిత చిన్నారికి రూ.2లక్షలు పరిహారం మంజూరు చేయాలని

Published : 21 Jan 2022 01:27 IST
షేక్‌ హైదర్‌

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడికి న్యాయస్థానం ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బాధిత చిన్నారికి రూ.2లక్షలు పరిహారం మంజూరు చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సిఫారసు చేస్తూ సైబరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయమూర్తి ఆర్‌.తిరుపతి గురువారం తీర్పునిచ్చారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కొంగర రాజిరెడ్డి కథనం ప్రకారం.. సైనిక్‌పురికి చెందిన షేక్‌ హైదర్‌ అలియాస్‌ యూసుఫ్‌ (77).. 2020 జనవరి 30న ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి(6)కి మిర్చి బజ్జీలు ఇస్తానని ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో మల్కాజిగిరి మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌తో పాప వాంగ్మూలాన్ని రికార్డు చేయించారు. దర్యాప్తు అనంతరం నిందితుడిపై సమగ్ర ఆధారాలతో పోక్సో చట్టం కింద కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని