logo

ఇకపై ‘గాంధీ’లో అన్ని సేవలు

గాంధీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు శుక్రవారం నుంచి అందుబాటులోకి తేనున్నారు. గురువారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు అన్ని విభాగాల అధిపతులతో

Published : 21 Jan 2022 01:49 IST

గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: గాంధీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు శుక్రవారం నుంచి అందుబాటులోకి తేనున్నారు. గురువారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు అన్ని విభాగాల అధిపతులతో సమావేశాన్ని నిర్వహించారు. కొవిడ్‌తో పాటు, నాన్‌కొవిడ్‌ వైద్యసేవలు అందించాలని, తద్వారా పేదలకు మంచి వైద్యం అందుబాటులో ఉండేలా సన్నద్ధం కావాలని సూచించారు. రెండేళ్లుగా వైద్య విద్యార్థులు సర్వీస్‌ను కోల్పోతున్న క్రమంలో అన్ని రకాల వైద్యసేవలను అందించేలా కృషి చేద్దామని తీర్మానం చేశారు. ఈనెల 11న ఎమర్జెన్సీ, ఓపీ సేవలను కొన్నాళ్లు కొనసాగిస్తామని, ఇన్‌పేషెంట్లుగా తీసుకోబోమంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దాన్ని రద్దు చేసి శుక్రవారం నుంచి కరోనా రోగులను వేరుచేసి, సాధారణ రోగులకు అత్యవసర, ఓపీ సేవలు అందించడంతోపాటు ఇన్‌పేషెంట్లను అడ్మిట్‌ చేసుకోవాలని నిర్ణయించినట్లు రాజారావు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 145 మంది కరోనా బాధితులు, 565 మంది సాధారణ రోగులు ఉన్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని