logo

నగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీరేలా కార్యాచరణ

విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్‌ ఇబ్బందులను అధిగమించేందుకు, నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని

Published : 21 Jan 2022 02:11 IST

పంజాగుట్ట శ్మశానవాటిక ఉక్కు వంతెన ప్రారంభం

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్‌ ఇబ్బందులను అధిగమించేందుకు, నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. గురువారం పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికకు అనుసంధానంగా రూ.17 కోట్లతో నూతనంగా నిర్మించిన ఉక్కు వంతెన(స్టీల్‌ బ్రిడ్జి)ని మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ.. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఉప మేయర్‌ మోతె శ్రీలత, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, కార్పొరేటర్‌ మన్నె కవితారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ, శ్మశాన వాటికలోకి వెళ్లేందుకు ఎదురవుతున్న ఇబ్బందులకు, ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యల శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలు, మంత్రి కేటీఆర్‌ పర్యవేక్షణలో నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణ, క్రమబద్ధీకరణకు అండర్‌ పాస్‌లు, పైవంతెనల నిర్మాణం తదితర అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు వివరించారు. బంజారాహిల్స్‌ రోడ్డు నం.10లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ క్వార్టర్స్‌ సమీపంలో నిర్మించతలపెట్టిన మల్టీపర్పస్‌ కమ్యూనిటీ హాల్‌, భూమి విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై మేయర్‌, ఎమ్మెల్యే దానం లు మంత్రి తలసాని దృష్టికి తీసుకువచ్చారు. సీఈ(ప్రాజెక్ట్స్‌) దేవానంద్‌, ఎస్‌ఈ రవీందర్‌రాజు, డీఎంసీ శ్రీనివాస్‌, అర్బన్‌ బయో డైవర్సిటీ ఉపసంచాలకులు శ్రీనివాస్‌, తెరాస నేతలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని