logo

చిత్రవార్తలు

నగర శివారు శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో నిర్వహించనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ్‌ ఉత్సవాలకు ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. రామానుజుడి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన గజరాజుల ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి.

Updated : 23 Jan 2022 02:39 IST

చకచకా.. చక్కగా..

నగర శివారు శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో నిర్వహించనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ్‌ ఉత్సవాలకు ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. రామానుజుడి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన గజరాజుల ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి.


నిలువెత్తు రూపం పోరాటానికి ప్రతిరూపం

స్వాతంత్య్ర సమర యోధుడు, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ దళపతి నేతాజీ జయంతి ఆదివారం.  ఆయన్ను స్మరించుకొనేందుకు  సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ముందు ఉన్న విగ్రహం వద్దకు ప్రముఖులు రానుండడంతో శనివారం రంగులద్దారు.


దస్త్రం డబ్బాలో.. న్యాయం ఆన్‌లైన్‌లో

న్యాయస్థానాల్లోనూ కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అన్ని కేసులను  ప్రస్తుతం ఆన్‌లైన్‌లో విచారిస్తున్నారు. సంబంధిత దస్త్రాలను నేరుగా తీసుకోకుండా, కోర్టుల వద్ద డబ్బాల్లో వేయాలని సూచిస్తున్నారు. కూకట్‌పల్లి న్యాయస్థానం వద్ద ఏర్పాటు చేసిన పెట్టెల్లోని దస్త్రాలను పరిశీలిస్తున్న సిబ్బంది.


చెట్టులో చెట్టునై.. సిగ్నలందించే టవరునై..

చూడగానే ఈత చెట్టుపై సెల్‌ టవర్‌ ఏర్పాటు చేశారని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇది పూర్తిగా సెల్‌ టవరే. శంషాబాద్‌ సమీపంలో ఓ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈత చెట్టు ఆకృతి వచ్చేలా నిర్మించి, ప్లాస్టిక్‌ ఆకులు ఆమర్చారు. ఇది దూరం నుంచి చూస్తే పచ్చటి ఆకులతో ఏపుగా పెరిగిన ఈత చెట్టులా కనిపిస్తోంది.


 

అపాయం పొంచి ఉంది

కొంపల్లి రోడ్డుపై

నంబరు 44 జాతీయ రహదారిపై భారీ వాహనాలు ఇష్టానుసారంగా వెళ్తుండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం వాహనాల రద్దీ ఉండే కొంపల్లి నుంచి మేడ్చల్‌ వరకు కనీసం ట్రాఫిక్‌ సిగ్నళ్లు లేకపోవడంతో మలుపులు, చౌరస్తాల వద్ద అపాయ ఘంటికలు మోగుతున్నాయి.


కండ్లకోయ గ్రామం వద్ద


సిద్ధమవుతున్న భవనం.. విద్యార్థులకు తీరనున్న కష్టం

తుది మెరుగులు దిద్దుకుంటున్న యాలాల కేజీబీవీ

మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం నూతన భవనం ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ కేజీబీవీలో 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థులున్నారు.  6-10 తరగతుల వారు 210 మంది, ఇంటర్‌లో 150 మంది చదువుతున్నారు. పాత భవనంలో వసతులు లేక అవస్థలు పడుతున్నారు. 2018లో రూ.1.54 కోట్లతో చేపట్టిన కొత్త భవనం పనులు పూర్తయి తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇందులో  గాలి, వెలుతురు వచ్చేలా విశాలమైన తరగతి గదులు,   డైనింగ్‌హాల్‌, గ్రంథాలయం, సైన్స్‌ ల్యాబ్‌ వంటి హంగులన్నీ ఉన్నాయి. మార్చిలో ప్రారంభించే అవకాశాలున్నాయని సమాచారం.

- న్యూస్‌టుడే, యాలాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని