logo

శత శాతం టీకా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

వైద్య సిబ్బంది, ప్రజా ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించి వందశాతం టీకా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో జ్వర సర్వే, వ్యాక్సినేషన్‌పై అత్యవసర సమావేశం నిర్వహించారు

Published : 23 Jan 2022 03:09 IST

సూచనలు చేస్తున్న ఎమ్మెల్యే ఆనంద్‌

వికారాబాద్‌ టౌన్‌: వైద్య సిబ్బంది, ప్రజా ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించి వందశాతం టీకా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో జ్వర సర్వే, వ్యాక్సినేషన్‌పై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పట్టణంలో వార్డుల వారీగా ఏఎన్‌ఎంలను టీకా ప్రక్రియ ఎంత వరకు పూర్తయిందనే విరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అధ్యక్షురాలు మంజుల, వైద్యాధికారి తుకారాం, ఉపాధ్యక్షురాలు శంషాద్‌బేగం, కమిషనర్‌ శరత్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.

వికారాబాద్‌ గ్రామీణ: ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా అందిస్తున్న మేకల యూనిట్లు పొందిన వారు వాటిని పోషించుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో జిల్లా గిరిజన శాఖ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ రుణాల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. శివారెడ్డిపేట పీఏసీఎస్‌ ఛైర్మన్‌ ముత్యంరెడ్డి, మండల పరిషత్‌ అధ్యక్షురాలు చంద్రకళ తదితరులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని