logo

రక్తదాతా.. కరుణించు

రక్తం కొరతతో తలసీమియా బాధితులు అల్లాడిపోతున్నారు. కరోనా కేసుల పెరుగుదల ప్రభావం రక్తదాన శిబిరాలపై పడింది.  రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 3,052 మంది బాధితులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 3 నెలల

Published : 23 Jan 2022 03:09 IST

నిల్వలు లేక తలసీమియా బాధితుల అవస్థలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: రక్తం కొరతతో తలసీమియా బాధితులు అల్లాడిపోతున్నారు. కరోనా కేసుల పెరుగుదల ప్రభావం రక్తదాన శిబిరాలపై పడింది.  రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 3,052 మంది బాధితులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 3 నెలల వయస్సు ఉన్నవారి నుంచి 30 ఏళ్ల వయస్సున్నవారు ఉన్నారు. వీరికి ప్రతినెలా రెండు సార్లు రక్తమార్పిడి చేయాలి. రక్తనిల్వలు నిండుకుంటుండటం.. దాతలు ముందుకు రాకపోవడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. రాజేంద్రనగర్‌ శివరాంపల్లిలో ఏర్పాటు చేసిన తలసీమియా అండ్‌ సికిల్‌ సెల్‌ సొసైటీకి రోగులు వచ్చి రక్తమార్పిడి చేసుకోవడంతో పాటు పరీక్షలు చేయించుకుని మందులు తీసుకెళ్తుంటారు. రోజూ ఇక్కడ 40 మందికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. నెలకు 2 వేల యూనిట్లు అవసరమవుతుంది. గతంలో రోజుకు 40-50 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసేవారు. ఇప్పుడు తగ్గిపోవడంతో, రక్తం ఎక్కించడం కష్టంగా మారిందని సొసైటీ ప్రతినిధులు చెబుతున్నారు. శిబిరాల నిర్వహణకు అనుమతివ్వాలని సొసైటీ జాయింట్‌ సెక్రెటరీ అలీంబేగ్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని