logo

బీసీల సంక్షేమానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలి

వచ్చే బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన బీసీ సంక్షేమ సంఘం జాతీయ

Published : 23 Jan 2022 03:09 IST

  హరీశ్‌రావుకు వినతిపత్రం ఇస్తున్న ఆర్‌.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ

కాచిగూడ, న్యూస్‌టుడే: వచ్చే బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణతో కలిసి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు కోకాపేటలోని కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. బడ్జెట్‌లో బీసీ కార్పొరేషన్‌ రాయితీ రుణాలకు రూ.5 వేల కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు, 12 బీసీ కులాల ఫెడరేషన్లకు రూ.2 వేల కోట్లు కేటాయించాలని కోరారు. బీసీ గురుకులాలకు సొంత భవనాల నిర్మాణానికి రూ.200 కోట్లు, బీసీ కళాళాల హాస్టల్‌ భవనాల నిర్మాణానికి రూ.200 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విదేశీ ఉన్నత విద్యకు ఇస్తున్న బడ్జెట్‌ను రూ. 60 కోట్ల నుంచి రూ. 300 కోట్లకు పెంచాలని కోరారు. నేతలు నీల వెంకటేశ్‌, మల్లేశ్‌యాదవ్‌, అనంతయ్య, సతీశ్‌, చరణ్‌యాదవ్‌, హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని