TS News: మార్చి 31 లోపు ప్రతి నియోజకవర్గంలో ‘దళితబంధు’: హరీశ్‌రావు
రాష్ట్రంలో మార్చి 31వ తేదీ లోపు ప్రతి నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలు చేసేలా
సంగారెడ్డి: రాష్ట్రంలో మార్చి 31వ తేదీ లోపు ప్రతి నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దళితబంధు పథకంపై ఆయన సంగారెడ్డిలో ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. సంగారెడ్డి జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో వంద మందికి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. కలెక్టర్ ఖాతాలో నిధులు జమ చేసినట్లు వివరించారు.
‘‘ప్రతి నియోజకవర్గంలో 100 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఏ గ్రామాన్ని ఎంపిక చేయాలన్నది ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు. పథకం అమలు కోసం ఎమ్మెల్యేలు జిల్లా బాధ్య మంత్రి అధ్యక్షతన నియోజకవర్గంలోని ఒకటి లేదా రెండు గ్రామాలను ఎంపిక చేయొచ్చు. ఆ సమాచారాన్ని జిల్లా అధికారులకు ఇస్తే వారు గ్రామాల్లో పర్యటించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, బ్యాంకు అకౌంట్లు తెరవడం ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి కావాలి. మార్చి మొదటి వారం కల్లా యూనిట్లను గ్రౌండ్ చేయాలి. ఈ ప్రక్రియకు రెండు నెలల గడువే ఉన్నందున అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి.
పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక చేస్తాం. దళిత బంధుపై రకరకాల రాజకీయ విమర్శలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం దళిత బంధును అమలు చేస్తున్నారు. వచ్చే బడ్జెట్లో దళితబంధుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తాం. వచ్చే ఆర్థిక ఏడాదిలో దళిత బంధును విస్తృతంగా అమలు చేస్తాం. భాజపా నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు’’ అని హరీశ్‌రావు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. -
ఆన్‌లైన్‌లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్‌పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్‌పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్