logo

రైతు అవయవదానం.. పలువురికి కొత్త జీవితం

ఓ రైతు అవయవదానం పలువురికి కొత్త జీవితం ప్రసాదించింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడికి చెందిన ఉప్పల రమేశ్‌గౌడ్‌(51)కు భార్య లావణ్య, ఇద్దరు పిల్లలున్నారు. వ్యవసాయం చేస్తూ

Updated : 24 Jan 2022 06:07 IST

రైతు అవయవదానం పలువురికి కొత్త జీవితం ప్రసాదించింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడికి చెందిన ఉప్పల రమేశ్‌గౌడ్‌(51)కు భార్య లావణ్య, ఇద్దరు పిల్లలున్నారు. వ్యవసాయం చేస్తూ, చిన్నపాటి హోటల్‌ నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈనెల 19న తున్కిబొల్లారం నుంచి వంటిమామిడికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వెనుక నుంచి కారు వచ్చి ఢీకొట్టిందని ఎస్‌ఐ రంగ కృష్ణ తెలిపారు. మెరుగైన వైద్యానికి సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఆదివారం విషమించి జీవన్మృతుడు అయినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జీవన్‌దాన్‌ బృందం కుటుంబీకులకు అవయవదానంపై అవగాహన కల్పించింది. వారు అంగీకరించడంతో కాలేయం, రెండు మూత్రపిండాలు, కళ్ల కార్నియాలు సేకరించారు. ఊపిరితిత్తులను ప్రత్యేక అంబులెన్స్‌లో మినిస్టర్‌ రోడ్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి అమర్చారు. మిగిలిన అవయవాలను నగరంలోని పలు ఆసుపత్రుల్లో అవసరమైన వారికి అమర్చినట్లు జీవన్‌దాన్‌ ఇన్‌ఛార్జి డాక్టర్‌ స్వర్ణలత పేర్కొన్నారు.

- ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, ములుగు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని