logo

లక్ష్యం.. సురక్షిత ప్రయాణం!

ఆర్టీసీ అంటే సురక్షిత ప్రయాణం. ఇదే ఉద్దేశంతో అత్యధికులు బస్సు ప్రయాణానికే మొగ్గుచూపుతారు. అక్కడక్కడ జరుగుతున్న ప్రమాదాలు మచ్చ తీసుకుస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్న లక్ష్యంతో సంస్థ ముందుకు

Published : 24 Jan 2022 01:04 IST

నేడు డ్రైవర్ల దినోత్సవం

ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహణ

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

గతేడాది నిర్వహించిన ర్యాలీ

ర్టీసీ అంటే సురక్షిత ప్రయాణం. ఇదే ఉద్దేశంతో అత్యధికులు బస్సు ప్రయాణానికే మొగ్గుచూపుతారు. అక్కడక్కడ జరుగుతున్న ప్రమాదాలు మచ్చ తీసుకుస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్న లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో ఏడాదికి ఓసారి డ్రైవర్ల దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల్లోనూ నేడు కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.
మెదక్‌ రీజియన్‌ పరిధిలో సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాలోని డిపోలు 8 (మెదక్‌, నారాయణఖేడ్‌, సంగారెడ్డి, జహీరాబాద్‌, సిద్దిపేట, గజ్వేల్‌ప్రజ్ఞాపూర్‌, దుబ్బాక, హుస్నాబాద్‌) ఉన్నాయి. ఆయా వాటి పరిధిలో 658 బస్సులు ఉన్నాయి. ఇందులో ఆర్టీసీ సంగారెడ్డి డివిజన్‌ పరిధిలో 369, సిద్దిపేట డివిజన్‌ పరిధిలో 289 బస్సులు ఉన్నాయి. నిత్యం 2.67 లక్షల కి.మీ. మేర తిరుగుతూ 2.50 లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి.

డొక్కు బస్సులతో చిక్కు
పల్లెవెలుగు బస్సుల్లో ఎక్కువగా డొక్కువే ఉంటున్నాయి. 10 లక్షల కి.మీ.కు పైగా తిరిగిన వాహనాలను గ్రామీణ ప్రాంతాలకు నడిపిస్తున్నారు. అవి ఎక్కడ ఆగుతాయో, ఎప్పుడు ప్రమాదానికి గురవుతాయో తెలియని పరిస్థితి. బాగున్న వాటినే తిప్పుతున్నామని, మిగతా వాటిని బస్‌భవన్‌కు పంపిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. డ్రైవర్లు మాత్రం ఏకీభవించని పరిస్థితి.

ఏం చేస్తారంటే..
డ్రైవర్ల దినోత్సవంలో భాగంగా ఉదయం విధులకు హాజరయ్యే చోదకులకు పూలు  చేతికిచ్చి అభినందిస్తారు. ప్రమాదరహిత ప్రయాణాలపై అవగాహనకు ప్లకార్డులతో ర్యాలీలు చేపడతారు. ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర అన్న అంశంపై పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తారు. డిపోల పరిధిలో సమావేశం ఏర్పాటు  చేసి సూచనలు చేస్తారు.


ప్రణాళిక సిద్ధం: సుదర్శన్‌, ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్‌
ప్రమాదాల నివారణే మా ముందున్న లక్ష్యం. అందులో భాగంగానే ప్రత్యేకంగా డ్రైవర్స్‌ డే కార్యక్రమానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. సురక్షిత ప్రయాణానికి కౌన్సెలింగ్‌ ఇవ్వనున్నాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిర్వహించేలా డిపోల వారీగా కార్యక్రమాలకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధంచేశాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని