logo

విశ్రాంత డీఎస్పీ ఇంట్లో ఆభరణాలు చోరీ

విశ్రాంత డీస్పీ ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 2లోని శ్రీనికేతన్‌ కాలనీలో ఉండే

Published : 24 Jan 2022 01:42 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: విశ్రాంత డీస్పీ ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 2లోని శ్రీనికేతన్‌ కాలనీలో ఉండే జూలపల్లి లక్ష్మణరావు ఎస్‌ఐబీ విభాగంలో డీఎస్పీగా పదవీ విరమణ చేశారు. ఈ నెల 18న ఆయన తన ఇంట్లోని అల్మారా తెరిచి చూడగా అందులో ఉండాల్సిన మూడున్నర తులాల బంగారు గాజులు కనిపించలేదు. ఇంట్లో మూడేళ్లుగా పనిచేస్తున్న నర్సమ్మ, నర్సింహా దంపతులను విచారించారు. వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో శనివారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆభరణాల విలువ దాదాపు రూ.1.75 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పనిమనుషులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని