logo

రేపు రాజ్‌భవన్‌ రోడ్డులో ట్రాఫిక్‌ ఆంక్షలు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 26న రాజ్‌భవన్‌ మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ తెలిపారు.

Published : 25 Jan 2022 02:07 IST

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 26న రాజ్‌భవన్‌ మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ తెలిపారు. ఉదయం 6 నుంచి 9 వరకు సోమాజిగూడలోని మోనప్ప కూడలి నుంచి రాజ్‌భవన్‌ వైపు, ఖైరతాబాద్‌ వీవీ కూడలి నుంచి రాజ్‌భవన్‌ వైపు, పంజాగుట్ట నుంచి రాజ్‌భవన్‌ క్వార్టర్స్‌ మీదుగా రహదారిని మూసివేస్తారు.

వేడుకలకు వచ్చేవారికి పార్కింగ్‌ వివరాలు: గేట్‌ నం.3 నుంచి అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ వరకు న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాలు. * దిల్‌కుషా అతిథి గృహంలో మీడియా వాహనాలు. * ఎంఎంటీఎస్‌ పార్కింగ్‌ స్థలంలో వీఐపీ, ప్రభుత్వ అధికారుల వాహనాలు.  * మెట్రో రెసిడెన్సీ నుంచి నాసర్‌ స్కూల్‌ వరకు, లేక్‌వ్యూ అతిథి గృహం నుంచి వీవీ కూడలి వరకు సింగిల్‌ లేన్‌ పార్కింగ్‌ ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని