logo

న్యాయవాదులకు రక్షణ కమిటీ ఏర్పాటు చేయాలి

న్యాయవాదులకు రక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని పలు జాతీయ న్యాయవాద సంఘాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరాయి. అంతర్జాతీయ న్యాయవాదుల నిరసన దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం....

Published : 25 Jan 2022 02:07 IST


సమావేశంలో పద్మ, లక్ష్మీదేవి, కొండారెడ్డి, సురేశ్‌కుమార్‌, వెంకన్న, దశరథ్‌, విష్ణువర్ధన్‌, సుదర్శన్‌ తదితరులు

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: న్యాయవాదులకు రక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని పలు జాతీయ న్యాయవాద సంఘాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరాయి. అంతర్జాతీయ న్యాయవాదుల నిరసన దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సుందరయ్య కళానిలయంలో ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌(ఐఏఎల్‌), ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు), భారత ప్రజాన్యాయవాదుల సంఘం(ఐఏపీఎల్‌) సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ప్రమాదంలో ప్రజాన్యాయవాదులు’ అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఏపీఎల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.వెంకన్న, జాతీయ సంయుక్త కార్యదర్శి డి.సురేశ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడే ప్రజాసంఘాల ప్రతినిధులు, నేతలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, నల్ల చట్టాల కింద ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు కొండారెడ్డి, ఐఏఎల్‌ ప్రతినిధి న్యాయవాది దశరథ్‌, నేతలు పద్మ, లక్ష్మీదేవి, విష్ణువర్ధన్‌, సుదర్శన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని