logo

వినికిడి లోపం.. పదునైన దృష్టి కోణం

మనిషికి ఏదైనా ఒక అవయవ లోపముంటే.. మరో అవయవం సమర్థంగా పనిచేస్తుందన్నది శాస్త్రీయంగా కూడా నిజమేనని పరిశోధకులు చెబుతున్నారు. వినికిడి లోపంతో పుట్టిన పిల్లల్లో సులువుగా గ్రహించే పదునైన

Published : 25 Jan 2022 06:46 IST

సమస్య ఉన్న వ్యక్తుల్లో అధికంగా గ్రహించే శక్తి

హెచ్‌సీయూ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి


రాకేశ్‌మిశ్రా, సీమాప్రసాద్‌, గౌరీశంకర్‌

ఈనాడు, హైదరాబాద్‌: మనిషికి ఏదైనా ఒక అవయవ లోపముంటే.. మరో అవయవం సమర్థంగా పనిచేస్తుందన్నది శాస్త్రీయంగా కూడా నిజమేనని పరిశోధకులు చెబుతున్నారు. వినికిడి లోపంతో పుట్టిన పిల్లల్లో సులువుగా గ్రహించే పదునైన దృష్టి కోణం ఉన్నట్లు హెదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. న్యూరల్‌, కాగ్నిటివ్‌ సైన్సెస్‌ కేంద్రం ఆచార్యుడు ప్రొ.రమేశ్‌ మిశ్రా ఆధ్వర్యంలోని పీహెచ్‌డీ విద్యార్థిని సీమాప్రసాద్‌, ఇంటర్న్‌ పూర్వ విద్యార్థి విద్య సోమశేఖరప్ప, వినికిడి-అంగవైకల్య జాతీయ సంస్థ ప్రతినిధి గౌరిశంకర్‌ భాగస్వామ్యంతో వినికిడి లోపమున్న పిల్లల్లో దృష్టికోణంపై పరిశోధన చేశారు. అధ్యయన ఫలితాలు ప్రముఖ జర్నల్‌ న్యూరోసైకోలొజియాలో ప్రచురితమయ్యాయి. దీని ప్రకారం..ఏకాగ్రతపై అధ్యయనాల్లో పోస్నర్‌ వరుసక్రమం సిద్ధాంతం కీలకమైనది. ఏదైనా స్క్రీన్‌పై రెప్పపాటు కనిపించే అంశాలను వినికిడిలోపం ఉన్న వ్యక్తులు సులువుగా గుర్తించగలరని సిద్ధాంతం సూచిస్తోంది. దీన్ని నిర్ధరిస్తూ హెచ్‌సీయూ పరిశోధకులు పరిశోధన చేపట్టారు. కారణాలను విశ్లేషించారు. సాధారణ పిల్లల కంటే వినికిడిలోపం ఉన్న తల్లిదండ్రులకు అదే లోపంతో జన్మించిన జన్మించిన పిల్లల్లో దృష్టి కోణం అధికంగా ఉందని గుర్తించారు. చిత్ర సహితమైన అంశాలను ఇట్టే గుర్తు పట్టేయగలరని చెబుతున్నారు. వినికిడిలోపం ఉన్న వ్యక్తులు తమ ముందు ఉన్న పరిసరాల్లో మెరుపు వేగంతో కనిపించే సమాచారాన్ని పట్టుకోగలరని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని