logo

అపోలో ఆసుపత్రుల్లో సెకండ్‌ ఒపీనియన్‌ సేవలు

రోగులకు అంతర్జాతీయ స్థాయిలో రెండో అభిప్రాయం (సెకండ్‌ ఒపీనియన్‌) సేవలు అందించేందుకు అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ దేశంలోనే తొలిసారిగా ‘ది క్లినిక్‌ బై క్లీవ్‌ ల్యాండ్‌ క్లినిక్‌’తో ఒప్పందం...

Published : 25 Jan 2022 02:31 IST


డా.సంగీతారెడ్డి

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: రోగులకు అంతర్జాతీయ స్థాయిలో రెండో అభిప్రాయం (సెకండ్‌ ఒపీనియన్‌) సేవలు అందించేందుకు అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ దేశంలోనే తొలిసారిగా ‘ది క్లినిక్‌ బై క్లీవ్‌ ల్యాండ్‌ క్లినిక్‌’తో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. సోమవారం వర్చువల్‌గా నిర్వహించిన సమావేశంలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.సంగీతారెడ్డి మాట్లాడుతూ.. రోగులకు అత్యుత్తమ సేవలు అందించడంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి కృషి చేస్తున్నామన్నారు. సంస్థ మెడికల్‌ డైరెక్టర్‌ డా.అనుపమ్‌ సిబల్‌, ది క్లినిక్‌ బై క్లీవ్‌ ల్యాండ్‌ క్లినిక్‌ సీఈవో ఫ్రాంక్‌ మెక్‌గిలిన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని