logo

బాలికలకు అండగా ఉంటాం

‘బాలికలకు మహిళా శిశు సంక్షేమ శాఖ అండగా ఉంటుంది. ఆడపిల్లల హక్కుల గురించి అవగాహన కల్పిస్తాం. వారిలో చైతన్యం తీసుకు రావడమే బాలికా దినోత్సవ ముఖ్య ఉద్దేశమని.....

Published : 25 Jan 2022 02:31 IST


మాట్లాడుతున్న జిల్లా శిశు సంక్షేమాధికారిణి లలితకుమారి

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ‘బాలికలకు మహిళా శిశు సంక్షేమ శాఖ అండగా ఉంటుంది. ఆడపిల్లల హక్కుల గురించి అవగాహన కల్పిస్తాం. వారిలో చైతన్యం తీసుకు రావడమే బాలికా దినోత్సవ ముఖ్య ఉద్దేశమని’ జిల్లా శిశు సంక్షేమాధికారి కె. లలితకుమారి అన్నారు. సోమవారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా స్థానిక ఎన్నెపల్లి యజ్ఞ ఫౌండేషన్‌ బాలికల ఆశ్రమంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 2008లో మహిళా శిశు మంత్రిత్వ శాఖ తీసుకున్న చొరవ కారణంగా ప్రతి ఏటా జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపి ప్రతి బాలిక తప్పనిసరిగా చదువుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు ఆడపిల్లలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ వెంకటేశ్వరమ్మ, సఖి కేంద్రం పరిపాలనాధికారి అనితారెడ్డి, యజ్ఞ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ అనురాధ, మల్లీశ్వరి, రామకృష్ణ, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు లక్ష్మణ్‌, రియాజోద్దిన్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు