logo

పోలీసు ప్రతిష్ఠను ఇనుమడింపజేయండి: ఎస్పీ

క్రమశిక్షణ, సమర్థత, అంకితభావంతో విధులు నిర్వహించి పోలీసు శాఖ ప్రతిష్ఠను ఇనుమడింప చేయాలని జిల్లా పోలీసు అధికారి ఎన్‌.కోటిరెడ్డి అన్నారు.

Published : 25 Jan 2022 02:44 IST


బదిలీపై వచ్చిన ఎస్‌ఐలతో మాట్లాడుతున్న ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్‌, న్యూస్‌టుడే: క్రమశిక్షణ, సమర్థత, అంకితభావంతో విధులు నిర్వహించి పోలీసు శాఖ ప్రతిష్ఠను ఇనుమడింప చేయాలని జిల్లా పోలీసు అధికారి ఎన్‌.కోటిరెడ్డి అన్నారు. సోమవారం పోలీసు కార్యాలయంలో జిల్లాకు బదిలీపై వచ్చిన 16 మంది ఎస్‌ఐలు, ఇద్దరు ఏఎస్‌ఐలు, ఓ హెడ్‌కానిస్టేబుల్‌తో ఆయన మాట్లాడారు. పోలీస్‌ ఠాణాకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, ఫిర్యాదులపై వెంటనే స్పందించి సత్వర న్యాయం అందించాలని తెలిపారు. ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే సీసీటీఎన్‌ఎస్‌లో నిక్షిప్తం చేయాలని కోరారు. ఒక్కో జిల్లా పరిస్థితులు ఒక్కోలా ఉంటాయని, వేర్వేరు జిల్లాల నుంచి వచ్చిన మీరందరూ ముందుగా జిల్లా భౌగోళిక, నైసర్గిక, వాతావరణ, ప్రజల అలవాట్లపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు. జిల్లాలో ఆత్మహత్యలు అధికంగా జరుగుతున్నాయని, నివారణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రషీద్‌, ఎస్‌బీ సీఐ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని