logo

నగరం ఓఆర్‌ఆర్‌ చెంతకు..బస్సులు కానరావు ఎంతకూ!

నగర విస్తరణ శరవేగంగా సాగిపోతోంది. ఇప్పుడు ఏకంగా ఔటర్‌ రింగురోడ్డు వేదికగా కాలనీలు వెలుస్తున్నాయి. ఎక్కడ ఉంటున్నారని చెప్పడానికి.. ఇప్పుడందరూ ఓఆర్‌ఆర్‌ దృష్టిలో ఉంచుకుని చెబుతున్నారు. ప్రజలకు సౌకర్యాలు కల్పించడం మాత్రం ఔటర్‌ వేదికగా సాగడంలేదు. ప్రజారవాణా కూడా.

Published : 26 Jan 2022 03:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగర విస్తరణ శరవేగంగా సాగిపోతోంది. ఇప్పుడు ఏకంగా ఔటర్‌ రింగురోడ్డు వేదికగా కాలనీలు వెలుస్తున్నాయి. ఎక్కడ ఉంటున్నారని చెప్పడానికి.. ఇప్పుడందరూ ఓఆర్‌ఆర్‌ దృష్టిలో ఉంచుకుని చెబుతున్నారు. ప్రజలకు సౌకర్యాలు కల్పించడం మాత్రం ఔటర్‌ వేదికగా సాగడంలేదు. ప్రజారవాణా కూడా.

డీఎంలకు వినతుల వెల్లువ..

శివార్లలో కాలనీలకు బస్సులు కావాలంటూ వినతులు వెల్లువెత్తుతున్నాయి. హెచ్‌సీయూ, చెంగిచెర్ల, ఫరూక్‌నగర్‌, ఈసీఐఎల్‌ క్రాస్‌రోడ్సు, జీడిమెట్ల, కుషాయిగూడ, హయత్‌నగర్‌, మెహిదీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ల వద్ద వందలకొద్దీ వినతులున్నాయి.

తగ్గిన బస్సులతో తలనొప్పులు..

కోటి జనాభా ఉన్న నగరంలో కనీసం 10 వేల బస్సులు కావాలి. 2,850 మాత్రమే ఉన్నాయి. గతంలో నగర శివార్లను కలుపుతూ జిల్లాలకు వెళ్లే సబర్బన్‌ సర్వీసులు ఇప్పుడు లేవు. 5 నుంచి 10 కిలోమీటర్లు ఆటోల్లో వస్తేకానీ సిటీ బస్సు దొరకదు.

కిక్కిరిసిన ఆటోల్లో ప్రమాదకరంగా..

శివార్లలో బస్సుల్లేక ప్రయాణికులు షేర్‌ ఆటోలను ఆశ్రయిస్తున్నారు. డీజిల్‌ ధరలు పెరిగి రూ.20 ఇస్తే 4 కి.మీ. కూడా తీసుకెళ్లడంలేదు. 5 కి.మీ. దాటితే రూ.10 ఎక్కువ వసూలు చేస్తున్నారు. నల్లగండ్ల, గోపన్నపల్లి, తెల్లాపూర్‌, మేడ్చల్‌-తూప్రాన్‌, శామీర్‌పేట, బాచుపల్లి, గచ్చిబౌలి నుంచి నార్సింగ్‌ వైపు ఇలా శివార్లన్నీ ఆటోలమయమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని