logo

చిత్ర వార్తలు

గణతంత్ర దినోత్సవానికి నగరం ముస్తాబైంది.  నగరంలోని ప్రధాన ప్రాంతాలు, చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ కార్యాలయాలను మువ్వన్నెల విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

Published : 26 Jan 2022 04:42 IST

మువ్వన్నెల కీర్తి

ణతంత్ర దినోత్సవానికి నగరం ముస్తాబైంది.  నగరంలోని ప్రధాన ప్రాంతాలు, చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ కార్యాలయాలను మువ్వన్నెల విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. చార్మినార్‌ వద్ద మంగళవారం 300 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. మువ్వన్నెల వెలుగుల్లో  దుర్గం చెరువు తీగల వంతెనను అలంకరించారు. ట్యాంక్‌బండ్‌ బుద్దుడి విగ్రహం వద్ద భారీ పతాకం విశేషంగా ఆకట్టుకుంది.


పతాక భక్తి.. ఈయనో విశ్రాంత సైనికోద్యోగి. పేరు జి.ప్రసన్నరావు. సైనిక విభాగంలో హవల్దార్‌ మేజర్‌గా పనిచేసి 1973లో రిటైరయ్యారు. కంచన్‌బాగ్‌లోని బీడీఎల్‌లో మరో 20 ఏళ్లు సెక్యూరిటీ గార్డుగా చేశారు. మూసాపేట భరత్‌నగర్‌కాలనీ ఎల్‌ఐజీ 250లో నివాసం. ఆయన నిత్యం తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేస్తారు. అలా మూడు దశాబ్దాలుగా ఎగరవేస్తున్న మువ్వన్నెల పతాకాలను ఇంట్లో భద్రపరుచుకుని దేశభక్తిలో స్ఫూర్తిని చాటుకుంటున్నారు. -మూసాపేట, న్యూస్‌టుడే


క్రికెటర్‌.. కేటీఆర్‌!

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం సూరారం డివిజన్‌ పరిధిలోని టీఎస్‌ఐఐసీ కాలనీలో రూ.2.38 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్‌ థీమ్‌ పార్కును మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ కాసేపు బ్యాట్‌పట్టి క్రికెట్‌ ఆడగా అందరూ ఆసక్తిగా తిలకించారు.


మధురమైన బాల్యం.. కావొద్దు గాయం

కొండలు, గుట్టలే మన మహా నగరానికి చారిత్రక సొబగులు. అంతవరకు బాగానే ఉన్నా.. స్థానికంగా ఉండే చిన్నారులు వాటిపైకి ఎక్కి ప్రమాదాల బారిన పడుతుంటారు. గుడిమల్కాపూర్‌ బోడగుట్టపైకి ఎక్కి అక్కడి బస్తీ చిన్నారులు పతంగులు ఎగరేస్తూ కనిపించారు.


రూ.కోట్లు కుమ్మరింపు.. ఎప్పుడో సాగర్‌కు ఇంపు

వందలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా హుస్సేన్‌ సాగర్‌ రూపురేఖలు మారడం లేదు. ఆ దుర్వాసనా పోవడం లేదు. కారణం.. ప్రధాన నాలాల నుంచి వచ్చే చెత్తాచెదారానికి అడ్డుకట్ట పడకపోవడమే. బేగంపేట నాలా నుంచి వచ్చే వ్యర్థాలు జలాశయం వద్ద గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్న దృశ్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని