logo

ఆర్థిక సమస్యతో కౌలు రైతు ఆత్మహత్య

ఆర్థిక సమస్యలతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌,

Published : 27 Jan 2022 01:06 IST

పాపన్నపేట, న్యూస్‌టుడే: ఆర్థిక సమస్యలతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, స్థానికులు తెలిపిన వివరాలు.. నార్సింగి గ్రామానికి చెందిన బోడ రాజు (36) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత సంవత్సరం మూడు ఎకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి పంట వేశాడు. అకాల వర్షాలతో పంట దిగుబడి అనుకున్నంతగా రాలేదు. అతడిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. బుధవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పోచమ్మ ఆలయ సమీపంలో ఉన్న వేప చెట్టుకు ఉరి వేసుకున్నాడు. అటుగా వెళ్తున్న స్ధానికులు గమనించి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని