logo

ముందు వినతి పత్రం.. తర్వాత సమ్మె తంత్రం

ఆర్టీసీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ముందు వినతిపత్రాలు సమర్పించి.. తర్వాత సమ్మె నోటీసు దిశగా అడుగులు వేస్తోంది ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ. బుధవారం

Published : 27 Jan 2022 02:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ముందు వినతిపత్రాలు సమర్పించి.. తర్వాత సమ్మె నోటీసు దిశగా అడుగులు వేస్తోంది ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ. బుధవారం సమావేశమై.. ఈ నెల 31న ఆర్టీసీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌లకు వినతిపత్రాలు సమర్పించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 3న కార్మికుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేస్తామని చెప్పింది. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు యూనియన్లు కొనసాగించాలని కోరుతూ కార్మికుల సంతకాలు సేకరించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 15న కార్మికుల సమస్యలపై ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టాలని తీర్మానించింది. టీఎస్‌ఆర్టీసీ సంయుక్త కార్యాచరణ కమిటీ ఛైర్మన్‌ కె.రాజిరెడ్డి నేతృత్వంలో ఈ నిర్ణయాలు తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని