logo

దూరమైన మన కూరగాయలు

రైతుబజారుకు వెళ్తే ఒక ధర.. కాలనీలో ఏర్పాటు చేసిన సంతలో మరో ధర.. సూపర్‌ మార్కెట్లో ఇంకోలా.. తోపుడు బండిమీద మరోలా.. ఇలా రకరకాల ధరలతో వినియోగదారులను

Published : 27 Jan 2022 02:49 IST

మూతపడిన దుకాణం

ఈనాడు, హైదరాబాద్‌: రైతుబజారుకు వెళ్తే ఒక ధర.. కాలనీలో ఏర్పాటు చేసిన సంతలో మరో ధర.. సూపర్‌ మార్కెట్లో ఇంకోలా.. తోపుడు బండిమీద మరోలా.. ఇలా రకరకాల ధరలతో వినియోగదారులను దోచుకునే వ్యవస్థకు వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ కళ్లెం వేయలేకపోతోంది.

రైతుబజార్లు విస్తరించలేని వేళ.. నగరంలో రైతు బజారు పెట్టాలంటే కనీసం రెండెకరాల స్థలం ఉండాలి. ఈ తరుణంలో వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ గతంలో ఒక ప్రణాళిక తయారు చేసింది. మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలోనే ‘మన కూరగాయలు’ పేరిట దుకాణాలు తెరిచింది. నగరవ్యాప్తంగా 200 దుకాణాలు పెట్టాలని ప్రణాళిక రచించింది. ఆ దిశగా 70 చోట్ల దుకాణాలను ప్రారంభించి వినియోగదారులకు సరైన ధరకు కూరగాయలు అందేలా ఏర్పాట్లు చేసింది. రైతుబజారు ధరల కంటే కిలోకు రూ.2-3 అధికంగా వసూలు చేసి.. నాణ్యమైన కూరగాయలను ప్యాకెట్లలో అందించడాన్ని నగరవాసులు ఆస్వాదించారు.

ప్రయోజనమెంతో.. హోల్‌సేల్‌ మార్కెట్‌కు వచ్చిన కూరగాయలతోపాటు.. రైతుల నుంచి నేరుగా తీసుకొచ్చిన వాటిలోంచి నాణ్యమైన కూరగాయలను ఎంపిక చేసి వాటిని పావుకిలో, అరకిలో.. కిలో చొప్పున ప్యాక్‌ చేసి.. ఏసీ ఉన్న ‘మన కూరగాయల’ దుకాణంలో సూపర్‌ మార్కెట్లను తలపించేలా అందంగా పేర్చి విక్రయిస్తుండేవారు. అధిక ధరలకు అడ్డుకట్టపడేది. డిజిటల్‌ తూకం.. బిల్లులు, చెల్లింపులు సైతం జరిగేవి. ఎక్కువ మొత్తంలో కూరగాయలు అవసరమైతే ముందుగానే చెబితే ఇంటికి చేరవేసే సౌలభ్యం ఉండేది. ఈ నేప వాటిని తెరిపించాలని వినియోగదారులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని