logo

దిల్లీ గణతంత్ర వేడుకల్లో మన ‘కళా ఖండం’

దిల్లీ గణతంత్ర వేడుకల్లో మన కళ తలుకులీనింది. నేషనల్‌ ఆర్ట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అన్నరపు నరేందర్‌తో పాటు మరో ఎనిమిది

Published : 27 Jan 2022 02:49 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: దిల్లీ గణతంత్ర వేడుకల్లో మన కళ తలుకులీనింది. నేషనల్‌ ఆర్ట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అన్నరపు నరేందర్‌తో పాటు మరో ఎనిమిది కళాకారుల బృందం తీర్చిదిద్దిన ఈ కళాఖండాన్ని దిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగిన వేడుకల్లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శన కోసం దేశవ్యాప్తంగా 500 మంది కళాకారులను ఆహ్వానించగా.. హైదరాబాద్‌ ఆర్ట్‌సొసైటీ ఎంపిక చేసిన 8మంది ఇందులో పాల్గొన్నారు. డిసెంబర్‌ 25 నుంచి జనవరి 2 వరకు పెయింటింగ్‌ క్యాంప్‌ జరిగింది. 750 మీటర్ల కాన్వాస్‌పై 500 మంది కళాకారులు చిత్రాలను తీర్చిదిద్దారు. చార్మినార్‌, నిజాం నవాబు నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ ఎదుట లొంగిపోయిన సన్నివేశం, గోల్కొండ బోనాలు, మల్లు స్వరాజ్యం, కాకతీయ కళాతోరణం, దాశరథి, కాళోజీ చిత్రాలతో పాటు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఇందులో పొందుపరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని