logo

సాగునీటి ప్రాజెక్టుల సాధనకు ఉద్యమం

రాజకీయాలకు అతీతంగా సాగునీటి ప్రాజెక్టులను సాధించుకునే దిశగా ఉద్యమిస్తామని ఇందుకోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం పరిగిలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు

Published : 28 Jan 2022 02:37 IST

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి

నాయకులతో కలిసి మాట్లాడుతూ...

పరిగి, న్యూస్‌టుడే: రాజకీయాలకు అతీతంగా సాగునీటి ప్రాజెక్టులను సాధించుకునే దిశగా ఉద్యమిస్తామని ఇందుకోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం పరిగిలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సాగునీటి వసతి లేకపోవడంతో రైతుల బతుకులు చితికిపోతున్నాయని అన్నారు. ప్రాణహిత -చేవెళ్లను కొండపోచమ్మ రిజర్వాయరు నుంచి కేపీ లక్ష్మీదేవిపల్లి వరకు నీటిని తీసుకురావలని డిమాండ్‌ చేశారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంతర్రాష్ట్ర వివాదంగా మారిందని రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌లు ఇవ్వకపోవడంతో ఇప్పట్లో జరిగే పనికాదని చెప్పారు. సీఎం ప్రకటన చేయని పక్షంలో ఫిబ్రవరి నెలలో పరిగిలో సాగునీటి సమస్యల సాధనపై భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని అన్నారు. శంకర్‌పల్లి వరకు వచ్చిన ప్రాణహితను పరిగి వరకు తీసుకువచ్చి రైతుల కష్టాలు తీర్చాలని అన్నారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చే సీఎం ప్రాణహితను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పరిగిలో ఉండి అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్న కేసీఆర్‌ హామీని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని తెలిపారు. ఎంతోకష్టపడి రైల్వేలైన్‌ నిర్మాణ పనులను మంజూరు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా ఇవ్వకుండా అడ్డుగోడ వేసిందని ఇందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన ప్రకటనే నిదర్శనమని వివరించారు. రూ.1900 నెవీ రాడార్‌ స్టేషన్‌ను సైతం అడ్డుకుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు కె.హనుమంతు, ఎం.లాల్‌క్రిష్ణప్రసాద్‌, పరశురాంరెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, క్రిష్ణ, రియాజ్‌, ఆంజనేయులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని