logo

చారిత్రక కట్టడాల పరిరక్షణకు కృషి

నగరంలోని చారిత్రక కట్టడాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేటలో.. నిజాం హయాంలో నిర్మించిన మెట్ల బావిని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌,

Published : 28 Jan 2022 02:37 IST

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

అర్వింద్‌కుమార్‌తో కలిసి మెట్ల బావిని పరిశీలిస్తున్న తలసాని శ్రీనివాస్‌

ఈనాడు, హైదరాబాద్‌, బన్సీలాల్‌పేట్‌, న్యూస్‌టుడే: నగరంలోని చారిత్రక కట్టడాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేటలో.. నిజాం హయాంలో నిర్మించిన మెట్ల బావిని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, సహిత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు కల్పనా రమేష్‌తో కలిసి గురువారం మంత్రి పరిశీలించారు. ఈ పురాతన మెట్ల బావి చెత్తాచెదారంతో పూడిపోగా.. సహిత సంస్థ, బల్దియా ఆధ్వర్యంలోని యంత్రాంగం కలిసి 2 వేల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను తొలగించింది. సంబంధిత ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మెట్లబావిని ఆగస్టు 15 నాటికి పూర్తిస్థాయిలో అభివృద్ధిచేస్తామన్నారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. త్వరలోనే మోండా మార్కెట్‌, మీరాలం మండి, సర్దార్‌ మహల్‌ తదితర పురాతన నిర్మాణాలను పునరుద్ధరిస్తామని వెల్లడించారు. అనంతరం ఎంజీ రోడ్డులోగాంధీ విగ్రహం పరిసరాలను మంత్రి తలసాని అర్వింద్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రాంతాన్ని ఆకట్టుకునేలా మారుస్తామన్నారు. అధికారులకు సూచనలు చేశారు. నమూనాలను జీహెచ్‌ఎంసీ విడుదల చేసింది. కార్పొరేటర్‌ కుర్మ హేమలత, జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, ఆర్డీవో వసంత, టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ క్రిస్టోఫర్‌, వాటర్‌ వర్క్స్‌ జీఎం రమణారెడ్డి, ట్రాన్స్‌కో డీఈ శ్రీధర్‌, ఈఈ సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని