logo

చక్రం తిరిగితే.. విద్యుత్తు పుడుతుంది!

భవిష్యత్తులో విద్యుత్తు డిమాండ్‌ను అధిగమించేందుకు నగరానికి చెందిన బాలుడు వినూత్న ఆవిష్కరణ చేశాడు. అతని ఆవిష్కరణకు ప్రపంచ రోబొటిక్స్‌ ఒలింపియాడ్‌లో మంచి గుర్తింపు దక్కింది.ఆలోచన మొదలైందిలా.. మాదాపూర్‌నకు చెందిన

Published : 28 Jan 2022 02:37 IST

నగర బాలుడికి ప్రపంచ రోబోటిక్స్‌ పోటీల్లో మూడో స్థానం

గోస్మార్ట్‌ ఆవిష్కరణను వివరిస్తున్న అశ్రిత్‌, అర్జున

ఈనాడు, హైదరాబాద్‌:  భవిష్యత్తులో విద్యుత్తు డిమాండ్‌ను అధిగమించేందుకు నగరానికి చెందిన బాలుడు వినూత్న ఆవిష్కరణ చేశాడు. అతని ఆవిష్కరణకు ప్రపంచ రోబొటిక్స్‌ ఒలింపియాడ్‌లో మంచి గుర్తింపు దక్కింది.
ఆలోచన మొదలైందిలా.. మాదాపూర్‌నకు చెందిన ఎదుకుళ్ల అశ్రిత్‌ స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఏటా 8 నుంచి 12 తరగతుల విద్యార్థులకు రోబొటిక్స్‌ రంగంలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రపంచ రోబొటిక్స్‌ ఒలింపియాడ్‌ జరుగుతుంటుంది. ఇతను వాహనాల చక్రాలకు ప్రత్యేకంగా సెన్సర్లు అమర్చి విద్యుత్తు ఉత్పత్తి అయ్యేలా చేశారు. దీన్ని బ్యాటరీకి అనుసంధానించి ఛార్జీ చేసేలా చూశారు. ఇలా కారు లేదా ద్విచక్ర వాహనానికి అవసరమైన విద్యుత్తు అవసరాలు తీరుతాయి. ‘గోస్మార్ట్‌’ పేరిట ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. దీనికి సంబంధించి గతేడాది అక్టోబరులో పిల్లల బైక్‌తో ప్రొటోటైప్‌ సిద్ధం చేశారు. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో అశ్రిత్‌కు తృతీయ స్థానం దక్కినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇతని ప్రాజెక్టుకు స్నేహితుడు కలిదిండి అర్జున్‌ సహకారం అందించగా.. మెంటార్‌గా బాషా వ్యవహరించారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని