logo

ఒక క్యాన్సర్‌కు చికిత్స చేస్తుండగా మరొకటి గుర్తింపు

‘అక్యూట్‌ ప్రోమైలోసిటిక్‌ లుకేమియా(ఏపీఎంఎల్‌)’ అనే రక్తక్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న యువకుడు(36) దురదృష్టవశాత్తు మరో క్యాన్సర్‌ బారినపడ్డాడు. కీమోథెరఫీ చేస్తుండగానే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పచ్చకామెర్లు రావడంతో వైద్యుల సూచనల మేరకు పరీక్షలు

Published : 28 Jan 2022 04:02 IST

యువకుడికి కిమ్స్‌లో అరుదైన శస్త్రచికిత్స  

సర్జరీ అనంతరం యువకుడితో వైద్య బృందం

ఈనాడు, హైదరాబాద్‌: ‘అక్యూట్‌ ప్రోమైలోసిటిక్‌ లుకేమియా(ఏపీఎంఎల్‌)’ అనే రక్తక్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న యువకుడు(36) దురదృష్టవశాత్తు మరో క్యాన్సర్‌ బారినపడ్డాడు. కీమోథెరఫీ చేస్తుండగానే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పచ్చకామెర్లు రావడంతో వైద్యుల సూచనల మేరకు పరీక్షలు చేయించుకోవడంతో పాంక్రియాస్‌(క్లోమగ్రంథి)లోనూ క్యాన్సర్‌ ఉన్నట్లు వెలుగుచూసింది. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ వైద్యులను సంప్రదించగా.. విజయవంతంగా క్లోమగ్రంథి క్యాన్సర్‌కు శస్త్రచికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించారు. వివరాలను కిమ్స్‌ ఆసుపత్రికి చెందిన సర్జికల్‌ అంకాలజిస్టు, రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ మధు దేవరశెట్టి గురువారం మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఫార్మారంగంలో పనిచేసే యువకుడు గతంలో రక్తక్యాన్సర్‌ బారినపడి ఓ ఆసుపత్రిలో కీమోథెరఫీ చికిత్స తీసుకుంటున్నాడు. ఇంతలో క్లోమగ్రంథిలో క్యాన్సర్‌ ఉన్నట్లు గుర్తించి కిమ్స్‌ ఆసుపత్రిలో చేరాడు. ఒక క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న వ్యక్తికి.. మరో క్యాన్సర్‌కు చికిత్స అందించడాన్ని సవాల్‌గా భావించారు. రోబోటిక్‌ సర్జరీ ద్వారా క్లోమగ్రంథిలోని కణతులను తొలగించాలని నిర్ణయించారు. అనంతరం శరీరంపై కోత లేకుండా చిన్నరంధ్రం ద్వారా క్లోమగ్రంథిలో కణతులను రోబోటిక్‌ విధానంలో విజయవంతంగా తొలగించామని డాక్టర్‌ మధు తెలిపారు. త్వరలో క్యాన్సర్‌కూ కీమోథెరఫీ అందిస్తామన్నారు.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని