logo

మీ సేవా కేంద్రంలో నగదు అపహరణ

మీ సేవా కేంద్రంలో చోరీకి పాల్పడిన నిందితున్ని 24 గంటల్లోపే అరెస్టు చేశారు. ఎల్బీనగర్‌లో డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపిన కథనం ప్రకారం... గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన అంబటి చక్రవర్తి(32) పాత నేరస్థుడు. గుంటూరు, సూర్యాపేట జిల్లాల్లో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లొచ్చాడు.

Published : 28 Jan 2022 04:02 IST

24 గంటల్లోపే నిందితుడి అరెస్టు

అంబటి చక్రవర్తి

నాగోలు, న్యూస్‌టుడే: మీ సేవా కేంద్రంలో చోరీకి పాల్పడిన నిందితున్ని 24 గంటల్లోపే అరెస్టు చేశారు. ఎల్బీనగర్‌లో డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపిన కథనం ప్రకారం... గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన అంబటి చక్రవర్తి(32) పాత నేరస్థుడు. గుంటూరు, సూర్యాపేట జిల్లాల్లో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లొచ్చాడు. పగటిపూట తాళం వేసిన ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహించి రాత్రుళ్లు చోరీలకు పాల్పడతాడు. గతేడాది మేలో జైలు నుంచి విడుదలయ్యాడు. దిల్‌సుఖ్‌నగర్‌ పీఅండ్‌టీ కాలనీలో ఉంటూ సరూర్‌నగర్‌లోని స్టీల్‌ బజార్‌లో పనిచేస్తున్నాడు. సులువుగా సంపాదించేందుకు మళ్లీ చోరీలకు పాల్పడుతున్నాడు. పీఅండ్‌టీ కాలనీలోని మీ సేవా కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ నెల 25వ తేదీ రాత్రి 9 గంటలకు నిర్వాహకుడు కేంద్రానికి తాళంవేసి వెళ్లిపోగా... అర్ధరాత్రి కిటికీ గ్రిల్స్‌ను వంచి లోనికి ప్రవేశించి కార్యాలయ అల్మారాలోని రూ.1.30 లక్షలు చోరీ చేశాడు. నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదుతో సరూర్‌నగర్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సీసీ ఫుటేజీలు పరిశీలించారు. నిందితుడి చిత్రాలు గుర్తించారు. ఎల్బీనగర్‌ సీసీఎస్‌, ఐటీ సెల్‌ సహకారంతో 24గంటల్లోపు నిందితున్ని అరెస్టుచేశారు. రూ.1,11,240 స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్‌ డీసీపీ యాదగిరి, ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని