logo

ప్రగతిలో తెలంగాణ ఆదర్శం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

నగర, పురపాలికల ప్రగతిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, ఆ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో భారీఎత్తున పనులు జరుగుతున్నాయని, ప్రజలకు సత్వర సేవలు అందుతున్నాయని రాష్ట్ర ఆబ్కారి, పర్యాటక, సాంస్కృతిక శాఖల

Published : 28 Jan 2022 04:02 IST

డైరీతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మమత, సత్యనారాయణ, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డి తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: నగర, పురపాలికల ప్రగతిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, ఆ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో భారీఎత్తున పనులు జరుగుతున్నాయని, ప్రజలకు సత్వర సేవలు అందుతున్నాయని రాష్ట్ర ఆబ్కారి, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని పురపాలక సంచాలక కార్యాలయంలో టీజీవో అనుబంధ తెలంగాణ మున్సిపల్‌ కమిషనర్ల సంఘం-2022 దైనందినిని మంత్రి ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ, ‘కేటీఆర్‌ సమర్థతతో రాష్ట్రంలోని పట్టణాలు, నగరాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయని, ప్రధాన సమస్యలైన మంచినీరు, రహదారులు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్‌ రద్దీ వంటి సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పురపాలక శాఖలో కొత్త నియామకాలతో పాటు ఉద్యోగులకు పెద్దఎత్తున పదోన్నతులు లభించాయన్నారు. పురపాలక ఉద్యోగులకు, కార్మికులకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో తాను ముందుంటానని తెలిపారు. టీజీవో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ పట్టణ ప్రగతి విజయవంతంలో మున్సిపల్‌ కమిషనర్లు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. పురపాలక సంచాలకుడు ఎన్‌.సత్యనారాయణ, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, సంఘం అధ్యక్షుడు కృష్ణమోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాబేర్‌ అలీ, టీజీవో హైదరాబాద్‌ శాఖ అధ్యక్షుడు కృష్ణాయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని