logo

కేవైసీ మారుస్తామని రూ.15 లక్షలు స్వాహా

‘క్విక్‌ సపోర్ట్‌ యాప్‌’ డౌన్‌లోడ్‌ చేయించిన సైబర్‌ దొంగలు తన ఖాతా నుంచి రూ.15 లక్షలు కొల్లగొట్టారంటూ ఓ బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం.. అంబర్‌పేట్‌, సీఈ కాలనీలో నివసించే చంద్ర అయ్యర్‌కు ఎస్‌బీఐలో ఖాతా ఉంది.

Published : 28 Jan 2022 04:02 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: ‘క్విక్‌ సపోర్ట్‌ యాప్‌’ డౌన్‌లోడ్‌ చేయించిన సైబర్‌ దొంగలు తన ఖాతా నుంచి రూ.15 లక్షలు కొల్లగొట్టారంటూ ఓ బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం.. అంబర్‌పేట్‌, సీఈ కాలనీలో నివసించే చంద్ర అయ్యర్‌కు ఎస్‌బీఐలో ఖాతా ఉంది. గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి తాను బ్యాంకు ప్రతినిధినంటూ పరిచయం చేసుకొని మీ కేవైసీ అప్‌డేట్‌ చేసుకోండి.. లేకపోతే ఖాతా రద్దవుతుందని హెచ్చరించాడు. ఆమెకో లింక్‌ పంపించి ‘క్విక్‌ సపోర్ట్‌ యాప్‌’ డౌన్‌లోడ్‌ చేయించాడు. ఆ లింక్‌లో పేరు, ఖాతా వివరాలు పొందుపర్చి, రూ.పది తెలిసిన వారి ఖాతాకు పంపించమన్నాడు. ఇలా అతను చెప్పిందల్లా ఆమె చేస్తూ పోయారు. కొద్దిక్షణాల్లోనే రూ.15 లక్షలు మరో ఖాతాకు బదిలీ అయ్యాయని సంక్షిప్త సందేశం వచ్చింది. బాధితురాలు సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు