logo

మార్కెట్‌ విలువ ధ్రువపత్రాల జారీకి ఆదేశాలివ్వండి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూ తగాదా సంబంధిత వ్యాజ్యాలు దాఖలు చేయడానికి మార్కెట్‌ విలువ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడానికి తహసీల్దార్లకు తగిన ఆదేశాలు.....

Published : 29 Jan 2022 03:06 IST

మూడు జిల్లాల కలెక్టర్లకు రంగారెడ్డి జిల్లా న్యాయమూర్తి లేఖ

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూ తగాదా సంబంధిత వ్యాజ్యాలు దాఖలు చేయడానికి మార్కెట్‌ విలువ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడానికి తహసీల్దార్లకు తగిన ఆదేశాలు ఇవ్వాలని జిల్లా ఇన్‌ఛార్జి ప్రధాన న్యాయమూర్తి ఆర్‌.తిరుపతి శుక్రవారం మూడు జిల్లాల కలెక్టర్లకు లేఖలు పంపారు. సాధారణంగా భూ సివిల్‌ తగాదాలు దాఖలు చేయాలంటే ఆ భూమి విలువను బట్టి ద్రవ్య అధికార పరిధి(పెక్యునరీ జురిస్‌డిక్షన్‌) ప్రకారం సంబంధిత కోర్టుల్లో దాఖలు చేస్తారు. దీనికి అధికారులు జారీ చేసే ధ్రువీకరణ పత్రాలే ప్రామాణికం. గతంలో వీటిని సబ్‌-రిజిస్ట్రార్లు జారీ చేస్తుండగా ధరణి అమలులోకి వచ్చిన తర్వాత తహసీల్దార్లకు కట్టబెట్టారు. తహసీల్దార్లు నేరుగా ఇవ్వకుండా ఆన్‌లైన్‌లో ధరణి నుంచి తీసుకోవాలని సూచిస్తున్నారు. డౌన్‌లోడ్‌ చేసుకున్న మార్కెట్‌ విలువ ధ్రువీకరణ పత్రాలపై అధికారి సంతకం ఉండదు. డౌన్‌లోడెడ్‌ పత్రాలు స్వీకరించవచ్చని తెలంగాణ కోర్టు చట్టంలో పొందుపరచలేదు. దీంతో న్యాయవాదులు, కక్షిదారులు కేసులు దాఖలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన జిల్లా న్యాయమూర్తి కలెక్టర్లకు లేఖలు రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని