logo

కంటోన్మెంట్‌కూ ఉచిత తాగునీరు

జీహెచ్‌ఎంసీలో మాదిరే కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో నివసిస్తున్న వారికి ఉచిత మంచినీరు అందే మార్గం సుగమమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

Published : 29 Jan 2022 03:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీలో మాదిరే కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో నివసిస్తున్న వారికి ఉచిత మంచినీరు అందే మార్గం సుగమమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఫిబ్రవరి 2న కంటోన్మెంట్‌ బోర్డు సమావేశానికి మంత్రి తలసాని హాజరు కానున్నారు. బోర్డు సీఈవో అజిత్‌రెడ్డితో పూర్తిస్థాయిలో చర్చిస్తారు. ఇప్పటికే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే సాయన్న, బోర్డు మాజీ సభ్యులు తీసుకెళ్లడంతో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు తాగునీటి కోసం ప్రతి నెల జలమండలికి రూ.1.20కోట్లు చెల్లిస్తోంది. కంటోన్మెంట్‌కు మాత్రం బిల్లులు రూ.60 లక్షలకు మించడంలేదు. జీహెచ్‌ఎంసీలో తాగునీరు ఉచితంగా ఇస్తుండడంతో ఇక్కడ బిల్లులు సరిగా చెల్లించడంలేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉచిత నీటికి సుముఖత చూపడంపై కంటోన్మెంట్‌ బోర్డు ఊరట చెందుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని