logo

జీరో బిల్లుల లెక్క తేలింది!

గ్రేటర్‌ వ్యాప్తంగా నల్లాదారులకు జలమండలి జీరో బిల్లుల జారీ అంశం దాదాపు కొలిక్కి వచ్చింది. గ్రేటర్‌లో గతేడాది నుంచి ఉచిత మంచినీటి పథకం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

Published : 29 Jan 2022 06:42 IST

ఇక ఫిబ్రవరి నుంచి కొత్త నీటి బిల్లులు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ వ్యాప్తంగా నల్లాదారులకు జలమండలి జీరో బిల్లుల జారీ అంశం దాదాపు కొలిక్కి వచ్చింది. గ్రేటర్‌లో గతేడాది నుంచి ఉచిత మంచినీటి పథకం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆధార్‌ నంబరును నల్లా వినియోగదారుడి గుర్తింపు సంఖ్యతో అనుసంధానం చేసుకునే వారికే ఈ పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు దాదాపు 13 నెలల గడువు ఇచ్చారు. గడువు సమయంలో బిల్లులు ఇవ్వలేదు. 10 లక్షల నల్లాదారుల్లో 6 లక్షల మంది నల్లాదారులు మాత్రమే అనుసంధానం చేసుకున్నారు. మరో 4 లక్షల మంది ముందుకు రాలేదు. వీరందరికి 13 నెలల నీటి బిల్లులు ఒకేసారి అందించాలని తొలుత భావించారు. పెద్ద మొత్తంలో బిల్లుల జారీతో విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో అనుసంధానం చేయకున్నా.. ఈ 13 నెలలకు సంబంధించి గృహ నల్లాదారులందరికి బిల్లులు మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 2021 డిసెంబరు వరకు జీరో బిల్లులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఫిబ్రవరి నుంచి కొత్త బిల్లుల జారీకి జలమండలి సిద్ధమవుతోంది. మాఫీ చేసిన 13 నెలల నల్లా బిల్లులు కాకుండా 2020 డిసెంబరు కంటే ముందున్న బకాయిల చిట్టాను అధికారులు బయటకు తీస్తున్నారు. చాలామంది ఏడాది, రెండేళ్లు కూడా బిల్లులు చెల్లించకుండా నీటిని వాడుకుంటున్నారు. ఫిబ్రవరి బిల్లుతోపాటు పాత బకాయిలను కలిపి బిల్లులు అందించాలని నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని