logo

ఓయూలో ఉద్రిక్తత

ఉస్మానియా యూనివర్సిటీలో ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం పురస్కరించుకొని క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉద్యోగ ప్రకటనలు జారీ చేసిన...

Published : 29 Jan 2022 03:06 IST

టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీల దహనం.. పలువురి అరెస్టు


పెట్రోల్‌ సీసాతో విద్యార్థి నాయకుడు సురేష్‌

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఉస్మానియా యూనివర్సిటీలో ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం పురస్కరించుకొని క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉద్యోగ ప్రకటనలు జారీ చేసిన తరువాతే మంత్రులు, ఎమ్మెల్యేలు ఓయూలో అడుగుపెట్టాలని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. టోర్నమెంట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఫ్లెక్సీలను విద్యార్థి నాయకులు దహనం చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి నల్లకుంట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో ఓయూ జేఏసీ నేత సురేష్‌ యాదవ్‌ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. ఒంటిపై పెట్రోల్‌ పోసుకోవడానికి ప్రయత్నించడంతో తక్షణమే స్పందించిన పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కొందరు విద్యార్థి నేతలను పోలీసులు ముందుస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. కరోన పేరుతో యూనివర్సిటీ బంద్‌ ఉంటే ఇక్కడే క్రికెట్‌ టోర్నమెంట్‌కు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు క్రికెట్‌ ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. యూనివర్సిటీ అధికార పార్టీకి అడ్డాగా మారిందని ఆరోపించారు. ఇక్కడికి వచ్చే మంత్రులు, నాయకులు నిరుద్యోగ సమస్యపై స్పందించిన తరువాతే ఇక్కడికి రావాలని డిమాండ్‌ చేశారు. దయాకర్‌, సంజయ్‌, వేణుగోపాల్‌, భీమ్‌రావు, బండి నరేష్‌, వెంకట్‌నాయక్‌, బైరు నాగరాజు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని