logo

చెత్త, చెదారం తొలగింపు.. ఈనాడు కథనానికి స్పందన

ముషీరాబాద్‌ పట్టణ ఆరోగ్య కేంద్రం ఆవరణలో చెత్త, చెదారాన్ని జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించారు. ‘‘నమ్మండి.. ఇది ఆరోగ్య కేంద్రమే’’ శీర్షికన శుక్రవారం ‘ఈనాడు’....

Published : 29 Jan 2022 03:32 IST


చెత్త తొలగించిన తర్వాత ఆరోగ్య కేంద్రం ప్రాంగణం

రాంనగర్‌, న్యూస్‌టుడే: ముషీరాబాద్‌ పట్టణ ఆరోగ్య కేంద్రం ఆవరణలో చెత్త, చెదారాన్ని జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించారు. ‘‘నమ్మండి.. ఇది ఆరోగ్య కేంద్రమే’’ శీర్షికన శుక్రవారం ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, భోలక్‌పూర్‌ యూపీహెచ్‌సీ వైద్యాధికారి కష్ణమోహన్‌ స్పందించారు. క్షయ నిరోధక కేంద్రం, కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రం వద్ద ఉన్న చెత్త, చెదారాన్ని తొలగింప చేశారు. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు. దోమల బెడదతోపాటు పురుగులు, పాములు తిరుగుతున్నాయని, రక్త పరీక్ష కేంద్రం వద్ద పందికొక్కులు సంచరిస్తున్నాయని సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. శిథిలావస్థకు చేరిన క్షయ నిరోధక కేంద్రాన్ని తొలగించి త్వరలో నూతన భవనం నిర్మించడానికి కృషి చేస్తానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని