logo

మదర్‌ డెయిరీ పాల విక్రయ కేంద్రాలు కూల్చొద్దని వినతి

జీహెచ్‌ఎంసీ పరిధిలోని నార్ముల్‌ మదర్‌ డెయిరీ పాల విక్రయ కేంద్రాలను యధావిధిగా కొనసాగించడంతో పాటు పాడి రైతులకు అందించాల్సిన రూ.4 ప్రోత్సాహకాన్ని వెంటనే విడుదల....

Published : 29 Jan 2022 03:32 IST


మంత్రి కేటీఆర్‌కు సమస్యను వివరిస్తున్న గంగుల కృష్ణారెడ్డి, చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి

హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: జీహెచ్‌ఎంసీ పరిధిలోని నార్ముల్‌ మదర్‌ డెయిరీ పాల విక్రయ కేంద్రాలను యధావిధిగా కొనసాగించడంతో పాటు పాడి రైతులకు అందించాల్సిన రూ.4 ప్రోత్సాహకాన్ని వెంటనే విడుదల చేయాలని ఆ సంస్థ ఛైర్మెన్‌ గంగుల కృష్ణారెడ్డి రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి ఆయన మంత్రి కేటీఆర్‌ను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి అశోక్‌ నగర్‌, చిక్కడిపల్లి పాల విక్రయ కేంద్రాలను కూల్చి బస్తీ దవాఖానాలను కట్టడానికి సన్నాహాలు చేస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎండీ అశోక్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని