logo

నిలోఫర్‌ ఆసుపత్రిలో నర్సుల కొరత

రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో అమలులోకి తీసుకొచ్చిన తరువాత.. ఆసుపత్రుల్లో నర్సులు కూడా ఇతర జిల్లాలకు బదిలీలపై వెళ్లారు. ఈ ప్రభావం నిలోఫర్‌ ఆసుపత్రిపై తీవ్రంగా ఉంది.

Published : 29 Jan 2022 03:28 IST

రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో అమలులోకి తీసుకొచ్చిన తరువాత.. ఆసుపత్రుల్లో నర్సులు కూడా ఇతర జిల్లాలకు బదిలీలపై వెళ్లారు. ఈ ప్రభావం నిలోఫర్‌ ఆసుపత్రిపై తీవ్రంగా ఉంది. ఇక్కడ ప్రతీరోజు 700 నుంచి 800 ఓపీ ఉంటుంది. వెయ్యికి తగ్గకుండా వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చిన శిశువులు, పురుడు పోసుకున్నవారు ఇన్‌పేషంట్లుగా ఉంటారు. 140 మంది నర్సులు ఒక్కసారిగా బదిలీలపై ఇతర జిల్లాలకు వెళ్లిపోయారు. ఫలితంగా ఉన్నవాళ్లపై పనిభారం పడుతోంది. వీరు వార్డులలోనే కాకుండా ఓపీ, ఎమర్జెన్సీ, లేబర్‌ వార్డులో పని చేయాల్సి వస్తోంది. ఇటీవల ప్రత్యేకంగా 150 పడకలతో కొవిడ్‌ వార్డు కూడా ఏర్పాటు చేశారు. మూడు, నాలుగు వార్డులకు అంటే సుమారు 100 మంది రోగులకు ఒక్క నర్సు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. ఆసుపత్రిలో 385 మంది నర్సులు ఉండాల్సింది ప్రస్తుతం 260 మాత్రమే ఉన్నారు. ఇందులో 140 మంది వెళితే మిగిలింది 120 మందే. వారూ షిఫ్ట్‌ల వారిగా పని చేస్తారు. ఇక పరిస్థితిని అర్థం చేసుకోవచ్ఛు ఖాళీ అయిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని