logo

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా.. ఒకరిపై కేసు

రేషన్‌ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 29 Jan 2022 05:31 IST

పూడూరు, న్యూస్‌టుడే: రేషన్‌ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కంకల్‌లో శుక్రవారం టాస్క్‌ ఫోర్స్‌ బృందంతో కలిసి దాడులు చేసినట్లు చెప్పారు. మినీ బోలేరో వాహనంలో 15 బస్తాల వరకు రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. పౌరసరఫరాల జిల్లా అధికారి సురేశ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కారకుడైన యాదాద్రి జిల్లా బీబీనగర్‌ రాంసింగ్‌ తండాకు చెందిన సైదులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. బస్తాలను పౌరసరఫరా అధికారులకు అప్పగించారు.


కూడళ్ల విస్తరణపై జీహెచ్‌ఎంసీ కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌ : నగరవ్యాప్తంగా కూడళ్ల విస్తరణపై జీహెచ్‌ఎంసీ కసరత్తు ప్రారంభించింది. ట్రాఫిక్‌ పోలీసులు ఇటీవల జరిగిన సమన్వయ సమావేశంలో పలు కూడళ్ల వద్ద సమస్యలున్నట్లు బల్దియాకు తెలిపారు. ఆక్రమణలు, చిరువ్యాపారుల కారణంగా కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడుతున్నట్లు పోలీసుశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ శాఖ ప్రతిపాదనలను ప్రణాళిక విభాగం పరిశీలించింది. పోలీసులు ఇచ్చిన జాబితాను సర్కిళ్ల వారీగా విడగొట్టి.. సంబంధిత జోనల్‌ కమిషనర్లు, ఉప కమిషనర్లకు పంపనున్నట్లు వెల్లడించారు. త్వరలో టెండర్లు పిలిచి నగరవ్యాప్తంగా కూడళ్ల విస్తరణ చేపట్టనున్నామని అధికారులు స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని