logo

చిత్ర వార్తలు

ప్రస్తుతం తిరుగుతున్న రైళ్లలో అన్నీ ఎలక్ట్రికల్‌, డీజిల్‌ రైళ్లే. మరి ఇది ఏ రైలో గానీ చాదర్‌ఘాట్‌ వద్ద శుక్రవారం రెండు ఇంజిన్లతో వెళుతూ భారీగా పొగ వదిలింది. కొద్దిసేపు ఆ ప్రాంతమంతా పొగ కమ్ముకుంది.

Published : 29 Jan 2022 03:39 IST

పొగ బండి.. కాలుష్యమండి!

ప్రస్తుతం తిరుగుతున్న రైళ్లలో అన్నీ ఎలక్ట్రికల్‌, డీజిల్‌ రైళ్లే. మరి ఇది ఏ రైలో గానీ చాదర్‌ఘాట్‌ వద్ద శుక్రవారం రెండు ఇంజిన్లతో వెళుతూ భారీగా పొగ వదిలింది. కొద్దిసేపు ఆ ప్రాంతమంతా పొగ కమ్ముకుంది.


కదిలి వస్తేనే..  ఆసరాలో కదలిక

హయత్‌నగర్‌ మండల పరిధిలో నివసించే అవ్వ వయసు 80 పైనే. సజీవంగా ఉన్నట్లు కన్పిస్తేనే ఆసరా పింఛను ఇస్తామని అధికారులు చెప్పడంతో శుక్రవారం మనవరాలి సాయంతో అష్టకష్టాలు పడి మండల కార్యాలయానికి వచ్చారు.


కిట్లు..  కిటకిట!

కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఇంటింటి సర్వేలో జ్వరం, దగ్గు లక్షణాలున్న వారిని గుర్తించి ఏడు రకాల మందుల కిట్లను అప్పటికప్పుడే అందజేస్తున్నారు. ఇలా అందజేసేందుకు, ప్రభుత్వ ఆస్పత్రులకు పంపేందుకు కోఠిలోని విక్టరీ మైదానంలో కిట్లను సిద్ధంచేశారు. వాటి బస్తాలివి.


జ్వరం.. ఇక్కడ నయం

ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. తీవ్రమైన జ్వరం, దగ్గు లక్షణాలతో బాధపడుతున్న కరోనా బాధితులు ప్రభుత్వ ఆస్పత్రుల బాట పడుతున్నారు. అలాంటి వారితో ఉస్మానియాకు వచ్చిన ఓ అంబులెన్సు నుంచి రోగిని ఆసుపత్రిలోకి సిబ్బంది తరలిస్తున్న చిత్రమిది.


హరితం.. కర్రే ఊతం!

హైదరాబాద్‌ - బెంగళూరు జాతీయ రహదారికి ఇరువైపులా  ఉన్న పచ్చదనానికి తోడు రహదారి మధ్యలో ఉన్న కొద్ది స్థలంలో సైతం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు వాటికీ ట్రీగార్డులు ఏర్పాటుచేయకుండా ఇలా కర్రలు  పాతి వాటికే మొక్కలను కట్టారు.


కాదేదీ.. అలంకరణకు అనర్హం!

ఖాజాగూడ కేర్‌ ఫౌండేషన్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రంలో టీకాలకు ఉపయోగించిన ఔషధం ఖాళీ సీసాలను కలిపి ఇలా టేబుల్‌పై కవరులా, సిరంజిలు, దూది తదితర సామగ్రి పెట్టుకునే డబ్బాలుగా తయారుచేసి వినియోగించుకుంటున్నారు. అందరినీ ఆకట్టుకుంటోందీ కళాత్మక ప్రయత్నం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని