logo

Telangana News: నేడు ఆటోలు, క్యాబ్‌లు, లారీలు బంద్‌: డ్రైవర్ల ఐకాస

డ్రైవర్స్‌ జేఏసీ చేపట్టిన బంద్‌తో బుధవారం అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు, లారీల సేవలు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటర్‌ వాహనాల చట్టం 2019 అమలు చేస్తూ జరిమానాల పేరుతో ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవర్లను

Updated : 19 May 2022 08:01 IST

ఈనాడు, హైదరాబాద్‌: డ్రైవర్స్‌ జేఏసీ చేపట్టిన బంద్‌తో బుధవారం అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు, లారీల సేవలు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటర్‌ వాహనాల చట్టం 2019 అమలు చేస్తూ జరిమానాల పేరుతో ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవర్లను నిలుపుదోపిడీ చేస్తోందని డ్రైవర్స్‌ ఐకాస మండిపడుతోంది. నూతన చట్టంను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ ఒక్క రోజు వాహనాల బంద్‌కు ఆటో, క్యాబ్‌, లారీ డ్రైవర్స్‌ యూనియన్‌ ఐకాస పిలుపునిచ్చింది. బుధవారం హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవనంలో ఐకాస కన్వీనర్‌ వెంకటేశం మాట్లాడుతూ.. పెరిగిన ఇంధన ధరలతో అష్టకష్టాలు పడి వాహనాలు నడుపుతున్న తమపై అదనపు భారం మోపడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. గురువారం ట్రాన్స్‌పోర్టు భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చామన్నారు. ఖైరతాబాద్‌ చౌరస్తా నుంచి ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌ వరకు భారీ ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేస్తామన్నారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఆర్‌ఐఎఫ్‌, క్యాబ్‌, ఆటో, లారీ సంఘాలు బంద్‌లో పాల్గొంటాయని పేర్కొన్నారు. సమావేశంలో ఐకాస నాయకులు అమానుల్లాఖాన్‌, సత్తిరెడ్డి, ఉమర్‌, లతీఫ్‌, రాజశేఖర్‌రెడ్డి, భిక్షపతి, మల్లేష్‌, ప్రేం ఆర్‌ మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఆటోలు, క్యాబ్‌లు, లారీలు గురువారం బంద్‌ పాటిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బుధవారం అర్ధరాత్రి నుంచే ముఖ్యమైన మార్గాల్లో ప్రయాణికుల అవసరాల మేరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు గ్రేటర్‌ జోన్‌ ఈడీ యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. బస్సులు అవసరమైతే 9959226160, 9959226154 నంబర్లకు ఫోను చేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని